
Adipurush 2nd Week collections : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు క్రేజ్ ఉన్న కూడా సినిమాల పరంగా అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి.. ఈయనకు ఉన్న మార్కెట్ చూసి నిర్మాతలు వరుసగా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తుంటే ఈయన ఎంచుకునే కథలు మాత్రం హిట్ ఇవ్వలేక పోతున్నాయి.. ఈయన బాహుబలి 2 తర్వాత ఒక్క హిట్ అంటే ఒక్కటి కూడా అందుకోలేక పోయాడు..
మరి తాజాగా ఈయన నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ”ఆదిపురుష్”.. ఈ పాన్ ఇండియన్ సినిమాను ఓం రౌత్ డైరెక్ట్ చేయగా జూన్ 16న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.. రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ సినిమాపై బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాములు బోల్తా కొట్టలేదు.. 500 కోట్ల బడ్జెట్ అంటే ఎంతో అద్భుతమైన సినిమాగా తీర్చిదిద్దాలి.. కానీ ఓం రౌత్ మొత్తం సినిమాను గాలికి వదిలేసాడని ఓ రేంజ్ లో నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. రామాయణం వంటి ఇతిహాస గ్రంధాన్ని అపహాస్యం చేసారని అంతా తిట్టిపోస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక మూడు రోజులైనా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయంటే అదంతా డార్లింగ్ క్రేజ్ అనే చెప్పాలి.. మొదటి మూడు రోజుల్లోనే 340 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వకుండా ప్రభాస్ కాస్త తన మార్కెట్ తో కాపాడగలిగాడు.. లేదంటే ఇది ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యేదో కూడా ఎవ్వరూ ఉహించలేరని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అయినప్పటికీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ కు చాలా దూరంలోనే ఆగిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 400 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రెండో వారంలోకి అడుగు పెట్టాక ఈ సినిమా కలెక్షన్స్ మరింత పడిపోయినట్టు తెలుస్తుంది. వీకెండ్ లో అయిన కాస్త మళ్ళీ ఉపందుకుంటుందేమో అని అనుకున్న వారికీ నిరాశ తప్పలేదు.. ఈ వారం ఒక్క సినిమా కూడా లేకపోయినా ఈ సినిమాను ఆడియెన్స్ పట్టించుకోక పోవడంతో క్లోజింగ్ కు వచ్చినట్టే తెలుస్తుంది. మరి ఇది ఎంత మేర నష్టాలను తెస్తుందో చూడాలి..