చిన్న సినిమాలే విజయం సాధిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలే హిట్ కొడుతున్నాయి. ఆదిపురుష్ భారీ బడ్జెట్ తో తీసినా నిరాశ పరచింది. చిన్న బడ్జెట్ తో తీసిన బేబి సినిమా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వసూళ్లు రాబడుతోంది. ఆదిపురుష్ సినిమా ఐదో రోజు రూ. 2 కోట్ల 43 లక్షలు షేర్ చేయగా బేబి మాత్రం ఐదో రోజు రూ.2.90 కోట్లు సాధించింది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తోందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రూ. 2.60 కోట్లు షేర్ వసూలు చేయడం గమనార్హం. మూడో రోజు వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ రాబట్టింది. చిన్న సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. రూ. 500 కోట్లతో నిర్మించిన ఆదిపురుష్ నిరుత్సాహపరచింది.
రోజురోజుకు బేబి కలెక్షన్లు చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. పెద్ద సినిమాలకు సాధ్యం కాని వసూళ్లు ఈ చిత్రం సాధిస్తోంది. దీంతో హిట్ టాక్ తెచ్చుకుంది. పెద్ద చిత్రాలకు రాని పేరు దీనికొచ్చింది. చిన్న బడ్జెట్ చిత్రాలు విజయం సాధిస్తుంటే పెద్ద చిత్రాలు మాత్రం డీలా పడుతున్నాయి. రూ. వందల కోట్లతో తీసినా ఆశించిన విజయం దక్కించుకోవడం లేదు.
పెద్ద తారాగణం కాదు. చిన్న బడ్జెట్ తో రూపొందించిన బేబి అందరి అంచనాలు తలకిందులు చేసింది. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలను కాలదన్ని ముందుకు వెళ్తోంది. బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధిస్తోంది. ముక్కు ముఖం తెలియని వారైనా బేబి సినిమా అద్భుతమైన విజయం సాధించడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో తెలియడం లేదు.
ReplyForward
|