
‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’. ప్రమోషనల్ ఈవెంట్ తిరుపతిలోని ఓ యూనివర్సిటీ గ్రౌండ్ లో ఇటీవల ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రభాస్ అభిమానులు వేలాది మంది తరలివచ్చారు. ఈవెంట్ నుంచి ప్రభాస్ తన పెళ్లి విషయంపై స్పందించడంతో ఫ్యాన్స్ సంబురం చేసుకున్నారు. అయితే ‘ఆదిపురుష్’ 16వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్ వర్క్ ను ఒక రేంజ్ లో చేస్తుంది మూవీ టీం.
తిరుపతిలో జరిగిన ఈవెంట్ వేధికగా ఫైనల్ ట్రయిలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే, ఈ ట్రయిలర్ కు భారీ వ్యూవ్స్ వచ్చాయి. ఇన్ని వ్యూవ్స్ వస్తాయని బహుషా చిత్ర యూనిట్ కూడా ఊహించలేదట. హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో రిలీజ్ చేశారు. చారిత్రక నేపథ్యం, రామాయణం ఇతిహాసాన్ని బేస్ చేసుకొని నిర్మించిన చిత్రం కాబట్టి సెన్సర్ బోర్డు క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మధ్య కాలంలో ఈ సర్టిఫికెట్ ఏ సినిమాకు ఇవ్వలేదంట సెన్సార్ బోర్డు. మూవీ రన్ టైం మూడు గంటలు (2 గంటల 59 నిమిషాలు) ఉంటుందట.
ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీసింగ్ కనిపించాడు. తిరుపతిలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సన్నీసింగ్ ప్రభాస్ ను పెద్దన్నగా వర్ణించాడు. ఈ పాత్ర కోసం ఆయనను సంప్రదించే ముందు చాలా మందిని సంప్రదించారట. అందులో జాతిరత్నాలు ఫేం నవీన్ పోలిశెట్టి కూడా ఉండడం విశేషం. అయితే నవీన్ పోలిశెట్టిని టీమ్ ఫైనల్ చేద్దామనే లోపు డైరెక్టర్ ఓం రౌత్ ఈ పాత్రకు సన్నీసింగే కరెక్టుగా సరిపోతాడని చెప్పారట. ఈ విషయాన్ని ప్రభాస్ కు చూచించడంతో ఆయన కూడా ఒకే అనేశారట. సన్నీసింగ్ కాకుండా నవీన్ పోలిశెట్టి ఈ పాత్ర వేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నయినా ఆయన కెరీర్ లో ఈ సినిమా ది బెస్ట్ గా నిలిచిపోయేది.
ReplyForward
|