
Adipurush Pre Release Event : వరుస ప్రమోషన్స్ తో ఈ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసారు ఆదిపురుష్ మేకర్స్.. ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటి.. ఈ సినిమా వచ్చే నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ తో రోజురోజుకూ హైప్ పెంచుతూ పోతున్నారు.
ఎప్పుడో టీజర్ తో విమర్శలు ఎదుర్కున్న ఆదిపురుష్ టీమ్ ఆ తర్వాత అనేక జాగ్రత్తలు తీసుకుని జూన్ 16కు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య రిలీజ్ చేస్తున్న అన్ని ప్రమోషనల్ కంటెంట్ భారీగా హైప్ పెంచేస్తుంది.. ట్రైలర్, ఫస్ట్ సింగిల్ తో భారీగా అంచనాలు పెంచేసిన టీమ్ ఇప్పుడు మరిన్ని బిగ్గెస్ట్ ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు.
త్వరలోనే సెకండ్ సింగల్ ను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పటికే మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ప్లాన్ చేసారు. ఇక హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తుండగా ఇందుకు ఏకంగా మంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నట్టు టాక్..
అయితే నరేంద్ర మోడీ సమయాన్ని బట్టి చెప్తాను అని కుదిరితే తప్పకుండ చెప్తా అని చెప్పాడట.. ఒకవేళ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే ఆదిపురుష్ గురించి రెండు మాటలు మాట్లాడిన బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ ఖాయమే అంటున్నారు. ఎంతైనా ఆదిపురుష్ ప్లానింగ్ అదుర్స్ అనాల్సిందే..