Avinash జబర్దస్త్ లో ముక్కు అవినాష్ కి మంచి పేరుంది. కామెడీ చేయడంలో అవినాష్ ది ప్రత్యేక శైలి. అచ్చం అక్కినేనిలా డాన్స్ చేస్తాడు. సాయికుమార్ లా వాయిస్ ఇస్తాడు. దీంతో జబర్దస్త్ లో మంచి స్థానం సంపాదించుకుంది. అవినాష్ ఇటీవల ఓ సొంత కారు కొనుగోలు చేయడం వివాదాలకు కారణమైంది. దీనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల తన తల్లి ఆరోగ్యం బాగా లేదని గుండె జబ్బు ఉందని స్టంట్ వేయాలని డాక్టర్లు చెప్పారని తన యూట్యూబ్ లో పెట్టాడు. దీంతో అందరు సానుభూతి చూపారు. అమ్మకు అనారోగ్యం ఉందని తెలియడంతో అమ్మ ఆరోగ్యంపై బాధ వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కారు కొనుగోలు చేయడం మాత్రం విమర్శలకు తావిచ్చింది.
బిగ్ బాస్ కు వెళ్లిన సమయంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా మహేంద్ర యూవీ 700 కారు కొనుగోలు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో అందరు శాపనార్థాలు పెడుతున్నారు. అప్పుడే అమ్మకు ఆరోగ్యం బాగా లేదని చెప్పి కారు కొనుగోలు ఎలా చేశావు అని కామెంట్లు పెడుతున్నారు. అమ్మ ఆరోగ్యాన్ని సాకుగా చూపి ఇలా కారు కొన్నావా అంటూ విమర్శలు చేస్తున్నారు.
అవినాష్ తన పాత కారుకు ప్రమాదం జరగడంతో దాన్ని ఎక్చేంజ్ చేసి కొత్త కారు కొనుగోలు చేశాడట. కానీ నెటిజన్లు మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో బిగ్ బాస్ షోకు వెళ్లినప్పుడు కూడా యాజమాన్యంతో గొడవలు జరగడంతో సెంటిమెంట్ కార్డు ఉపయోగించుకుని బయట పడ్డాడని చెబుతుంటారు. ఇలా అవినాష్ పై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు.