
After Romance He Called Sister :సదా.. ఈ బ్యూటీ ప్రేక్షకులకు బాగానే సుపరిచితం.. జయం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకుంది.. ఆ తర్వాత వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. అయితే ఈమె టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించి కెరీర్ పరంగా అయితే సక్సెస్ అయ్యింది.
తెలుగు లోనే కాకుండా తమిళ్ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.. అయితే ఇలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.. 40 ఏళ్ళు వస్తున్నా కూడా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సింగిల్ మిగిలి పోయింది.. అందుకు కారణం ఈమె లవ్ ఫెయిల్యూర్ అని తెలుస్తుంది..
ఈమె 40 ఏళ్లకు చెరువులోకి వస్తున్నా కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలి పోవడానికి కారణం గతంలో ఈమె ఒక హీరోను ప్రేమించి మోసపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయం కాస్త పక్కన పెడితే ఈమె విక్రమ్ తో అపరిచితుడు సినిమా చేసిన విషయం తెలిసిందే.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా ఇప్పటికి టివిలలో జనాలు చాలా ఇష్టంగా చూస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ సమయంలో సదాకు విక్రమ్ కు మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందట. వీళ్లిద్దరు తెరమీద రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ ఆ తర్వాత అన్న చెల్లి అని పిలిపించు వారని.. శంకర్ వారిని చూసి ఇది బయట తెలిస్తే జనాలు నవ్వుకునే వారని అనేవారట.. ఇలా అనుకుంటే సినిమాలో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అని డైరెక్టర్ శంకర్ కాస్త సీరియస్ గా చెప్పారట.. కానీ వీరు మాత్రం వీరి తీరు మార్చుకోలేదని ఒక ఇంటర్వ్యూలో ఈమె చెప్పుకొచ్చింది.