25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Dr. Jai : టీడీపీ చారిత్రక విజయం తర్వాత తెలుగునేలపై డా.జై గారు.. విజేతలకు అభినందన

    Date:

    UBLOOD Founder Dr. Jai
    UBLOOD Founder Dr. Jagadish Babu Yalamanchili

    Dr. Jai Garu : అభివృద్ధి ప్రదాత,  పాలన దక్షుడు, సమర్థ పాలకుడు, గ్రేట్ విజనరీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి నెల కావొస్తోంది. జగన్ రెడ్డి అసమర్థ, అవినీతి, దందా, కబ్జా పాలనను తరిమికొట్టిన ఆంధ్రా ప్రజలు గత నెలరోజులుగా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ప్రజాస్వామ్య సంపూర్ణత్వాన్ని అనుభవిస్తున్నారు. ఈ భావన ఏ ఒక్క ఆంధ్రుడిదో కాదు..విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలందరిది. అందుకే ఏపీలో చంద్రబాబు సీఎం కావాలని వారు ఎంతగా తపించారో.. అమెరికాలో ఉండి మరీ ఆంధ్రాలో బాబు పాలన రావాలని అహోరాత్రులు కష్టపడ్డారు. అలాంటి వారిలో యూబ్లడ్ ఫౌండర్  డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు మొదటి వరుసలో ఉంటారు.
    డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు అమెరికాలో ఉంటున్నప్పటికీ.. వైసీపీ పాలనలో ఏపీ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. సమర్థ పాలకుడు వస్తేనే ఏపీ ప్రగతి పథంలో పయనిస్తుందని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని నమ్మేవారు జై గారు. అందుకే చంద్రబాబు గారు సీఎంగా రావాలి.. ఆంధ్రుల రాత మారాలి అని పరితపించేవారు. దీని కోసం ఏపీలో టీడీపీ కూటమి రావడానికి తన సంస్థల ద్వారా ముఖ్యంగా తమ ప్రముఖ మీడియా సంస్థలైన ‘జై స్వరాజ్ టీవీ’ యూట్యూబ్ చానల్స్, వెబ్ సైట్స్ ద్వారా జగన్ పాలనలో ఏపీకి జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు అనుక్షణం చూపించడం, చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాల్సిన అవశ్యకతపై ప్రచారం నిర్వహించారు.
    డా. జై గారి కష్టానికి తగిన ఫలం లభించింది. టీడీపీ కూటమి ఏపీలో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ అద్భుత విజయం సాధించిన నెల తర్వాత తొలిసారిగా తన మాతృభూమి అయిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై అడుగుపెట్టారు యూబ్లడ్ ఫౌండర్ డా. జగదీశ్ బాబు యలమంచిలి. గుండెల నిండా సంతోషంతో తాను పుట్టిన నేలను కళ్లకు అద్దుకుని మొక్కారు. పవిత్రమైన తన నేల మట్టిని బొట్టుగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  ఎమోషనల్ అవుతూ..‘‘ ఒక గొప్ప చారిత్రక విజయం తర్వాత అమరావతి.. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్న వేళ నా మొదటి అడుగు నా తెలుగు మాతృభూమిలో పెట్టిన సమయం.. జయహో అమరావతి.. ఏపీ.. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్ బ్రదర్.. జై మోడీ, లోకేష్ బాబు’’ అని ఎంతో సంతృప్తిగా, సంతోషంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఏపీ అభివృద్ధికి, అమరావతి నగర నిర్మాణానికి ఎన్ఆర్ఐలు సైతం ఎంతగా తపించిపోతున్నారో ఆయన ఫొటోల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు మరోసారి సీఎం కావడానికి డాక్టర్ జై జగదీశ్ బాబు యలమంచిలిగారు పడ్డ కష్టం వృథా పోలేదు.. అది రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కు ఆశా కిరణంగా నిలిచింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Amaravati : రూ.లక్ష కోట్లతో అమరావతి 2.0

    Amaravati : ప్రధాని నరేంద్ర మోడీ నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...