Vijay Sai Reddy YSRCP PArty : వైసీపీలో నంబర్ 2 గా పేరున్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఆయనను వైసీపీ అధినేత జగన్ దూరం పెట్టారని కూడా కథనాలు బయటకు వచ్చాయి. తారకరత్న మృతి సమయంలో చంద్రబాబుతో ఆయన సఖ్యతతో మెలగడమే ఇందుకు కారణంగా అందరూ భావించారు. ఆయనను కొన్ని బాధ్యతల నుంచి తప్పించారు కూడా. అయితే ఇప్పుడు విజయసాయి మళ్లీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం కేంద్రంగా పార్టీని బలోపేతం చేసే పనిలో ఆయన పడ్డారని సమాచారం. ఇక్కడ ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జగన్ కూడా కొన్నాళ్లు సజ్జల కు ప్రాధాన్యమిచ్చినా, ఇప్పుడు విజయసాయి వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విజయ సాయి అవసరం ఇప్పుడు తెలిసొచ్చిందని అంతా భావిస్తున్నారు.
అయితే సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును తిరిగి కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు పార్టీ కార్యక్రమాలను మెనేజ్ చేసుకునే బాధ్యతను ఇకపై ఉమ్మారెడ్డి చూసుకోనున్నారు. దీంతో పాటు నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తికి ప్రాధాన్యం తగ్గించినట్లుగా తెలుస్తున్నారు. అలాగే అనుబంధ విభాగాలను కూడా బలోపేతం చేసే దిశగా విజయసాయి కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మేనేజర్ ను మచిలీపట్నం పంపించినట్లుగా తెలుస్తున్నది. అనుబంధ విభాగాల ప్రక్షాళనకు ఇదే సమయంగా ఆయన భావిస్తున్నారు. వీలైనంత వరకు ఎన్నికలకు ముందే వీటిని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఈ టీంలలో తన వాళ్లను పెట్టుకోవడం ద్వారా పార్టీలో తానే నంబర్ 2 అని విజయసాయి మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనను వ్యతిరేకించి ఇన్నాళ్లు పార్టీలో రాజకీయం చేసిన కొందరికి ఇప్పుడు విజయ సాయి మళ్లీ కీలకం కావడం మింగుడు పడడం లేదని సమాచారం. ఏదేమైనా విజయసాయికి కేంద్ర పెద్దలతో మంచి సఖ్యత ఉంది. దీంతో పాటు ఆయన ఏ పనైనా నమ్మకంగా చేసుకువచ్చే వ్యక్తి. ఇలాంటి సమయంలో విజయసాయి అవసరాన్ని జగన్ గుర్తించారు. అందుకే ఇప్పుడు కొన్నాళ్ల గ్యాప్ తర్వాత విజయసాయి టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ట్వీట్ల దాడి మరోసారి షురూ చేశారు. ఇక తేల్చుకుందాం అనేంతలా కౌంటర్లు మొదలు పెట్టారు. ప్రత్యర్థులపై సెటైర్ల వేస్తున్నారు. ఇక వైసీపీ శ్రేణులకు మరోసారి గట్టి జోష్ నింపే ప్రయత్నం మొదలుపెట్టారు.
ReplyForward
|