YSRCP, TDP, Janasana : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. అధికార, విపక్షాలు ఈ మేరకు అస్ర్తాలు సిద్ధం చేసుుంటున్నాయి. మరోసారి గెలవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీ, జనసేన పావులు కదుపుతున్నాయి. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాతో ముందుకెళ్తున్నారు. మరోవైసపు వైసీపీని గద్దె దించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సర్వే తేల్చిందెందంటే..
జగన్, చంద్రబాబు, పవన్ లలో జనం ఎవరివైపు ఉన్నారనే కోణంలో జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ఒక సర్వే చేసింది. ఇప్పుడీ సర్వే సంచలనంగా మారింది. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈ సర్వే చేసింది. భారత్ జన్ గన్ కా మన్ పేరుతో ఈ సర్వే నిర్వహించింది. జూన్ చివరి వారంలో ఈ సర్వే చేసినట్లుగా చెప్పుకుంది. జాతీయ స్థాయితో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ సర్వే చేసినట్లు తెలిపింది. అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ గెలవడం ఖాయమని, తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ పట్టం ఖాయమని తేల్చింది.
లోకసభ ఎన్నికల్లో..
బీజేపీ 285 నుంచి325 సీట్లు
కాంగ్రెస్ 111 నుంచి 149 సీట్లు
టీఎంసీ 20-22
వైసీపీ 24-25
బీజేడీ 1214
బీఆర్ఎస్ 09-10
ఇలా లెక్కలు తేల్చింది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉండగా, 9 నుంచి 10 బీఆర్ఎస్ కు దక్కుతాయని ఈ సర్వే వెల్లడించింది. తిరిగి 2019 ఎన్నికల ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని స్పష్టం చేసింది. ఇక ఏపీలో వైసీపీ విజయ ఢంకా ఖాయమని అభిప్రాయపడింది. వైసీపీ 24 నుంచి 25 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీ కేవలం 0-1 సీటుకే పరిమితమవుతుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన పొత్తు ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదని ఈ సర్వే తెలిపింది. దీంతో పాటు 2019 ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ మరో రెండు సీట్లు పెంచుకోబోతున్నదని తెలిపింది. అయితే లోక్ సభ ఎన్నికల వరకే ఈ సీట్లు అంచనా వేసింది. అయితే ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉండనున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ReplyForward
|