- న్యూజెర్సీలో రంగ్ తాలి గర్భా వేడుకలు
Aishwarya Majmudar : ఏఅండ్ కే ఈవెంట్స్ కుశాల్ తక్కర్ సమర్పణలో అక్టోబర్ 7న న్యూ జెర్సీలో రంగ్ తాలి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో భారతీయ సంగీత ప్రపంచంలో దూసుకెళ్తున్న ఐశ్వర్య మజ్ముదార్ తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు.
రంగతాలీ గర్బా -2023 ఈవెంట్ ని ఆస్వాదించడానికి వీక్షకులు సిద్ధమవుతున్నారు. ఆహ్లాదకరమైన సంప్రదాయ, సంగీతంలో ప్రేక్షకులను అలరించనున్నారు. గర్బా యువరాణి, ఐశ్వర్య మజ్ముదార్ సమక్షంలో, ఉత్సవాలు మరింత పీక్స్ కు వెళ్లనున్నాయి. ఆమె ఆకర్షణీయమైన ప్రదర్శనలు గర్బా వేడుకలను ప్రేక్షకులకు మరపురాని అనుభవాన్ని అందించనున్నాయి. రంగతాలీ-2023 కేవలం ఒక నృత్య కార్యక్రమం మాత్రమే కాదు. సంస్కృతి-ఐక్యతకు చిరునామాగా నిలవనున్నది. గుజరాత్ గొప్ప వారసత్వాన్ని ఆలింగనం చేసుకుంటూ, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలు గర్బా స్ఫూర్తితో కలిసి వస్తారు.
అలరించనున్న ఐశ్వర్య
ప్రసిద్ధ గాయని ఐశ్వర్య మజ్ముదర్ తన అందమైన పాటలతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. ఈ వేడుకలోనూ ప్రేక్షకులను తన గాత్రంతో అలరించనున్నారు.
ఐశ్వర్య మజ్ముదార్ , ప్రతిభావంతులైన సంగీత విద్వాంసురాలు. గుజరాతీ, హిందీ సంగీత పరిశ్రమలో గాయనిగా ఎంతో పేరుగాంచారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ లో యూఎస్ఏ, కెనడాలో వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 1993 అక్టోబర్ 5న జన్మించిన ఐశ్వర్య 2008 లో స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా -చోటే ఉస్తాద్ అవార్డు పొందారు.
అప్పటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచే తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తున్నది. మొదటి ఆల్బమ్ లో గుజరాతీ భక్తి పాటలు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ అడుగుపెట్టి సంగీత ప్రపంచంలో తనకు తిరుగలేదని నిరూపించుకున్నారు. ఆమె అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ చదివారు. మూడేళ్ల వయసులోనే ఆమెను తల్లితండ్రులకు మసంగీత శిక్షణ తరగతులకు పంపించారు.