
Akkineni Heroes not Covered : ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న రీల్ హీరోలకు బాగా ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే.. వీరు కెమెరా ముందు ఒకలా కెమెరా లేనప్పుడు మరోలా ఉంటారు.. వీళ్ళ మాట తీరుతో స్పష్టమైన తేడా అనేది తప్పకుండా ఉంటుంది.. అయితే ఈ లెక్కలలో నుండి అక్కినేని హీరోలను తీసేయాలి..
ఎందుకంటే వీరు కెమెరా ముందు ఒకలా కెమెరా లేనప్పుడు మరోలా ఉండరు.. ఎప్పుడు కూడా తమ మనసులో ఉన్న విషయాన్నీ ఓపెన్ గా చెబుతూ ఎక్కడ కూడా తేడా అనేది చూపించరు.. ఎందుకు ఇలా చెప్తున్నామంటే.. వీళ్లకు కవర్ చేయడం రాదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే తెలుసు.. ఇలా మాట్లాడడంలో తప్పేం ఉంది అని కూడా ఎదురు ప్రశ్నిస్తారు.
అక్కినేని నాగార్జున అలా చెబుతాడు అనుకుంటే ఆయన వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా ఓపెన్ గా చెప్పేస్తూ షాక్ ఇస్తున్నారు.. చైతూ ఈ మధ్య కస్టడీ ప్రమోషన్స్ లో పరశురామ్ నా టైం అంతా వేస్ట్ చేసారని ఓపెన్ గా చెప్పేసి షాక్ ఇచ్చాడు. ఇక అఖిల్ ఏజెంట్ ప్రమోషన్స్ సమయంలో కూడా ఇంతే ఓపెన్ గా సమాధానం చెప్పాడు.
కెరీర్ లో వచ్చిన ప్లాప్స్ లో తనకు కూడా భాగం ఉంది అని జెన్యూన్ గా ఉంటే హాయిగా ఉంటుంది అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.. అలాగే నాగార్జున కూడా ఇప్పటికి చాలా సార్లు ఓపెన్ గా రియాక్ట్ అయ్యారు.. గతంలో ఈయన నటించిన ఒక సినిమా ఎలా హిట్ అయ్యిందో తెలియలేదు అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు.. ఇలా తమకు అస్సలు కవర్ చేయడమే రాదు అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం అని చాలా సార్లు నిరూపించారు తండ్రి కొడుకులు..






