
Akshaya Patra 2023 in NewJersey : అమెరికాలోని న్యూజెర్సీలో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో టీఆర్ఐ స్టేట్ గాలా (TRI-STATE GALA) విద్యార్థుల కోసం స్పాన్సర్ షిష్-2023 నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం విద్యార్థుల పాలిట వరంగా మారనుంది. ఇందులో పాల్గొని విజేతలైన విద్యార్థులకు టీఆర్ఐ గ్రాట్యూడ్ స్టేట్ గాలా (TRI STATE GRATTTUDE GALA) అత్యధిక స్థాయిలో స్పాన్సర్ షిప్ అందజేయనుండటం విశేషం.
ప్లాటినమ్ లెవల్లో 50వేల డాలర్లు.. డైమాండ్ లెవల్లో 20వేల డాలర్లు.. గోల్డ్ 10వేల డాలర్లు.. సిల్వర్ 5వేల డాలర్లు.. బ్రాంజ్ 3వేల డాలర్లు.. బెనిఫ్యాక్టర్(Benefactor) వెయ్యి డాలర్ల చొప్పున విజేతలకు స్పాన్సర్ షిప్ అందజేయనున్నారు. వీటితోపాటు పలు ఆకర్షణీయ బహుమతులను విద్యార్థులకు అక్షయ పాత్ర.. టీఆర్ఐ స్టేట్ గాలా సంయుక్తంగా అందజేయనుంది.
అక్టోబర్ 7న Newark Liberty International Airport Marriott, 1 Hotel Road, Newark, NewJersy-07714 నందు సాయంత్రం 5:30 గంటలకు నిర్వహించున్నట్లు నిర్వాహాకులు పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా Philanthropist, Entrepreneur Desh. DeshPande మరియు Gala Chair. Kushal Sacheti హాజరుకానున్నారు. అదేవిధంగా మ్యూజికల్ ఈవినింగ్ విత్ స్పెషల్ ఫార్మమెన్స్ కార్యక్రమంలో Divika Bhise (American Actress) పాల్గొననున్నారు. స్పాన్సర్ షిప్ మరియు మిగతా వివరాల కోసం [email protected], [email protected] లను సందర్శించాలని నిర్వాహాకులు సూచించారు.