Alekhya :
చీకటిని చూసి తిట్టుకునేకంటే ఓ చిరుదీపం వెలిగించడం మంచిది ఇది చైనా సామెత. మనకు సాధించాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. దానికి ఏవీ అడ్డంకులు రావు. అన్ని అనుకూలంగానే ఉంటాయి. మనం వాడుకునే తీరును బట్టే ఉంటుంది. మనం ఎలా మార్చుకుంటే పరిస్థితులు కూడా అలా మనకు అనుకూలంగా మారతాయి. కొందరి జీవితాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమార్తె అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో తల్లి కూతురును తీసుకుని పుట్టింటికి చేరింది. తల్లికి భారం కాకుండా వసతి గృహంలో ఉండి చదువుకుంది. పదో తరగతి వచ్చేసరికి తల్లి ఆరోగ్యం క్షీణించి కన్నుమూసింది.
ఏప్రిల్ లో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అలేఖ్య 9.7 మార్కులు సాధించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తున్న అలేఖ్యకు పలువురు ఆర్థిక సాయం చేస్తన్నారు. ఆమె చదువుకు సాయం చేయాలని కోరుతున్నారు. ఆమె చదువుకు ఆర్థిక సాయం అందించి ఆమె ఎదుగుదలకు తోడ్పడాలని చెబుతున్నారు.
అలేఖ్య పరిస్థితులకు భయపడక ఎదురు నిలిచింది. మంచి మార్కులు సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. తన ప్రతిభతో అత్యధిక మార్కులు తెచ్చుకుని ప్రశంసలు అందుకుంది. అలేఖ్య జీవితం వడ్డించిన విస్తరి కాదు. సమస్యల మయం. అయినా ఆమె ధైర్యం చెడలేదు. వెనకడుగు వేయలేదు. ముందుకు నడిచి విజయం సాధించింది.