Dettadi Alekhya Harika :
సోషల్ మీడియా విస్తరిస్తున్న సమయంలో దాన్ని ఆయుధంగా వాడుకొని బాగా పాపులర్ అయ్యింది దేత్తడి అలేఖ్య హారిక. యూ ట్యూబ్ లో చానల్ పెట్టి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలను పోస్ట్ చేసి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె ఛానల్ కు లక్షలను దాటి కోట్ల సంఖ్యలో పాలోవర్స్ ఉండేవారు. ఇప్పటికీ వీడియోలు చేస్తుంది. ఈ మధ్య ఒక వీడియో కవర్ సాంగ్ చేసింది.
అప్పుడప్పుడే విస్తరిస్తున్న సోషల్ మీడియా ఎలాగైతే ఉపయోగించుకోవాలో ఆమెకు తెలిసినంతగా ఆ సమయంలో ఎవరికీ తెలియకపోవడం గమనార్హమే. ప్రతీ వారం రెండు, లేదా మూడు వీడియోలను పోస్ట్ చేసేది. నాగార్జున లాంటి స్టార్ హీరోలు కూడా ఆమె వీడియోలకు ఫిదా అయ్యారంటే ఆమె ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే సెలబ్రెటీగా మారింది. ఈ మధ్య ఆమె చేసిన ఒక వీడియో సాంగ్ లో అందాలను బయటపెట్టింది.
వివిధ రకాల కంటెంట్ ను ఆమె ది బెస్ట్ గా పర్ఫార్మెన్స్ చేసేది. ఫలితంగా ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో బాగా క్రేజ్ పెరిగింది. ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్, ఫన్ టాపిక్స్ ను ఎంచుకునేది. వీటితో వెండితర తారలను కూడా ఆమె ఆకర్షించింది. ఫలితంగా బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేసింది. ఈ షోలో నాగార్జున కూడా తన వీడియోలను బాగా చూస్తారని చెప్పడంతో ఒక్క సారిగా షాక్ తిన్నది దేత్తడి పాప.
ఇక బిగ్ బాస్ సీజన్ 4లో హౌజ్ లోకి వెళ్లింది అలేఖ్య హారిక. తన ఆటతీరుతో ప్రేక్షకులను తన వైపునకు మళ్లించుకుంది ఈ బ్యూటీ. ప్రతీ వారం కూడా మంచి మార్కులతో సెన్షేషనల్ సృష్టించేది. ఎప్పుడూ పోటీలో ముందు వరుసలోనే నిలిచేది. ఈ నేపథ్యంలో దాదాపు 8 సార్లు కేప్టెన్సీ టాస్క్ కు అర్హత సాధించి బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే రికార్డు క్రియేట్ చేసింది.
అప్పుడప్పుడూ ఇంగ్లిష్ లో మాట్లాడుతున్న అలేఖ్య హారికను బిగ్ బాస్ చాలా సార్లు హెచ్చరించాడు. ఇందులో విన్నర్ అభిజిత్ కు దగ్గరైంది ఆమె. అతనితో అలేఖ్య హారిక లవ్ ట్రాక్ నడిపిందని సోషల్ మీడియాలో గాసిప్ లు వచ్చాయి. వీటిని ఆయన కొట్టిపరేశాడు. బిగ్ బాస్ లో ఫినాలే వరకు వచ్చిన ఆమె వెనుతిరగాల్సి వచ్చింది.
బిగ్ బాస్ తర్వాత ఆమె మరింత పాపులారిటీ దక్కించుకుంది. దీంతో బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆమె కనిపించడం మొదలు పెట్టింది. సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించింది. ‘వరుడు కావలెను’లో చిన్న పాత్ర వేసింది. ప్రస్తుతం ‘వెళ్లకే’ అనే కవర్ వీడియో సాంగ్ చేసింది. ఇందులో ఆమె పరువాలు, అందాలు చూపిస్తూ బాగా ఆకట్టుకుంది. క్లీవేజ్ షో చేస్తున్న దేత్తడి అలేఖ్య నిహారిక పిక్స్, వీడియోలు చూసేందుకు యువకులు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు.