
Chiranjeevi family : మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఓ సెంటిమెంట్ వెంటాడుతోందని అనిపిస్తుంది. ఆయన ఇంట సంతానం ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఇంత ఆలస్యంగా రాం చరణ్ కు పిల్లలు కలిగినా అబ్బాయి పుట్టి ఉంటే బాగుండేదని మెగాఫ్యాన్స్ అనుకుంటున్నారట. అయితే ఓ సందర్భంలో ఆయన పెద్ద కూతురు సుశ్మిత కూడా తనకు కోడలు కంటే అల్లుడు వస్తేనే బాగుంటుంది అన్నారు.
చిరంజీవికి మనుమడిని ఎత్తుకునే భాగ్యం కలుగలేదు. ఆయనకు ఉన్న ఇద్దరు కూతుళ్లకు అమ్మాయిలే పుట్టారు. రాం చరణ్ కు కూడా అమ్మాయే పుట్టింది. 2012లో రాం చరణ్-ఉపాసన వివాహం చేసుకున్నారు. వీరిది లవ్ కమ్ అరెంజ్ మ్యారేజ్ ఒకే చోట చదువుకున్న వీరు ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించారు. పెళ్లి గ్రాండ్ గా జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లి అయ్యింది. కెరీర్ దృష్ట్యా కొన్ని రోజులు పిల్లలు వద్దునుకున్నారని అప్పట్లో ఇద్దరూ చెప్పారు కూడా.
ఎంత ఆలస్యమైనా బాబు పుడితే బాగుండేదని మెగా అభిమానులు అనుకుంటున్నారు. మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘రామ్ చరణ్ కు ఎవరు పుట్టినా ఓకే కానీ అబ్బాయి కావాలని నా పర్సనల్ గా కోరుకుంటున్నాను. దానికి రీజన్ కూడా ఉంది. మా ఫ్యామిలీలో అందరూ అమ్మాయిలే, నాకు, నా చెల్లెకు అమ్మాయిలే పుట్టారు. అబ్బాయి ఇద్దరికీ కలుగలేదు. అందుకే అబ్బాయి కావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు కాగా సుస్మితకు ఇద్దరు అమ్మాయిలు. శ్రీజకు కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టారు. ఇక రాం చరణ్ కు మరో అమ్మాయి. మొత్తం చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. అయితే చిరంజీవికి మనుమడిని ఎత్తుకునే యోగం లేదా..? అంటూ మెగా ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి రాం చరణ్ రెండో సంతానంలోనైనా వారసుడికి కంటే చిరంజీవి మరింత ఆనందంలో మునిగి తేలుతారనిపిస్తుంది.






