Akkineni Amala : అక్కినేని కుటుంబానికి కోడలుగా వచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమైన హీరోయిన్ అక్కినేని అమల.. ఈమె టాలీవుడ్ లోకి హీరోయిన్ గా వచ్చి ఆ తర్వాత అక్కినేని కోడలిగా మారింది. ఈ భామ ఒకప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ కూడా అందుకుంది.
ఇక తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయం లోనే ఈ భామ అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట శివ అనే సినిమాలో కలిసి నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత అమల పూర్తిగా అక్కినేని కోడలిగా మారిపోయి సినిమాలకు దూరం అయ్యింది.
అప్పుడప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ వస్తున్న ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తాను ఒక సీక్రెట్ ను రివీల్ చేసింది. ఆమె నటించిన ఒక సినిమా కారణంగా అమ్మాయిలు ఇళ్ల నుండి పారిపోయారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అక్కినేని అమల 1991లో మలయాళంలో నటించిన ”ఎంటే సూర్యపుత్రికు” అనే సినిమాలో రెబల్ క్యారెక్టర్ లో నటించి మెప్పించిందట. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈమె నటన చుసిన కేరళ అమ్మాయిలు అమల ఇంటికి వెళ్లి మరీ ఆమె క్యారెక్టర్ ఎంతో నచ్చింది అని తమలో స్ఫూర్తి నింపింది అని చెప్పడంతో చాలా సంతోషం వేసిందట.. ఆ తర్వాత వీరిని జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళింటికి పంపించాను అంటూ అమల చెప్పుకొచ్చింది.
ReplyForward
|