
Elections తెలంగాణ లోని ప్రస్తుతం అన్ని పార్టీలలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇందులలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించింది. ఈ సారి ఎలాగైనా తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ను ఏర్పాటు చేయాలని తీవ్రంగా కృషి చేస్తుంది. కాంగ్రెస్ లో నాయకులకు కొదువలేదు. అదే పెద్ద సమస్యగా మారింది. నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు కొత్త గా బీసీ సీట్ల అంశం ముందుకు రావడంతో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారిందని సమాచారం.
గతంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ 119 స్దానాలకు గానూ బీసీ లకు కేవలం 28 స్థానాలను మాత్రమే కేటాయించగలిగింది. ఆ సమయంలో బీసీ అభ్యర్థులు కొంత నిరాశ కు గురైనట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల కోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధి లో రెండు అసెంబ్లీ స్ధానాలలో బీసీ వర్గంకు కేటాయించాలని ప్రతిపాదించాడు. తెలంగాణలో దాదాపుగా 56 శాతం బీసీ జనాభా ఉన్నందున కనీసం 50 సీట్లు అయినా బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ లోని బీసీ అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం లో బీసీ ల ప్రాధాన్యం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లో బీసీ లకు సీట్ల కేటాయింపు తో పాటు మరో కొత్త డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. బీసీలకు కేటాయించే 50 సీట్లను ఖచ్చితంగా గెలిచే స్ధానాలలో మాత్రమే కేటాయించాలని బీసీ అభ్యర్థులు కోరుతున్నట్లు తెలుస్తంది.
అయితే ఇతరుల వల్ల పార్టీ పటిష్టంగా మారిన నియోజక వర్గాలలో బీసీ అభ్యర్థులను నిలబెట్టడం అనేది చాలా గమ్మత్తుగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ లో ప్రతీ పార్టీ లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను వెల్లడించడం గొప్ప సాహసమనే చెప్పాలి. అందులోనూ కాంగ్రెస్ పార్టీ లో ఈ పక్రియ కత్తి మీద సాము లాంటిదే అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.






