Pushpa 2 Review : మూడు సంవత్సరాల విరామం తర్వాత, పుష్ప 2: ది రూల్ పేరుతో అల్లు అర్జున్ మనముందుకు వచ్చారు. అత్యంత ఎదురుచూసిన సీక్వెల్ ఎట్టకేలకు విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా భారీ అంచనాలతో విడుదలైంది. అభిమానులు దీనికోసం ఉత్సాహంతో ఎదురుచూశారు. మరి పుష్ప 2 ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.
కథ:
పుష్ప (అల్లు అర్జున్) ఒక చిన్న ఎర్రచందనం కూలీ నుండి సిండికేట్ సభ్యునిగా.. చివరికి యజమానిగా ఎదిగి, శక్తివంతమైన స్మగ్లర్‌గా మారుతాడు. కానీ ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్)తో అతనికి కొనసాగుతున్న వైరం తీవ్రమవుతుంది. ఈలోగా, పుష్ప తన ప్రత్యేక వ్యూహాలను ఉపయోగించి ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)ని సీఎం చేయాలని ప్లాన్ చేస్తాడు. షెకావత్ కు సవాల్ చేస్తూ దేశం నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తానని తొడగొడుతాడు. ఇంతలో పుష్ప అన్నయ్య కుటుంబం కష్టాల్లో పడుతుంది. ఆ సంక్షోభం ఏమిటి? పుష్ప ఇందులో పాల్గొన్నాడా? మరి ఆయన సిద్ధప్పను సీఎంగా ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలన్నీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడతాయి.
– ప్లస్ పాయింట్లు:
పుష్ప 2లో అల్లు అర్జున్ నటన అదిరిపోయింది. తన పాత్రలో లోతుగా ఒదిగిపోయాడు. నిండైన ప్రదర్శనను అందించాడు. కీలకమైన ఎమోషనల్ , యాక్షన్ సన్నివేశాలలో అతని నటన అద్భుతంగా సాగింది. ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది. పుష్ప రాజ్ పాత్రలో అతని పాత్ర చిత్రానికి అద్భుతమైన మైలేజ్ ను ిస్తుంది.
అల్లు అర్జున్ పాత్రను చాలా జాగ్రత్తగా ఖచ్చితత్వంతో రూపొందించడానికి దర్శకుడు సుకుమార్ కృషి కనిపించింది. ఈ సీక్వెల్‌ను ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభవంగా మార్చడానికి సుకుమార్ , అల్లు అర్జున్ ఇద్దరూ తమ కష్టాన్ని చూపించారు.
రష్మిక మందన్న భావోద్వేగాలతో నటనలో ఇంటెన్స్ చూపించింది.
ఫహద్ ఫాసిల్ ఈసారి మరింత ముఖ్యమైన పాత్రతో పోలీసుగా తన విశ్వరూపాన్ని చూపాడు. అల్లు అర్జున్‌తో అతని ముఖాముఖీలు ఉర్రూతలూగిస్తాయి. అతని అద్భుతమైన నటనా సామర్థ్యాలు థియేటర్లో ఈలలు వేయిస్తాయి.
యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను వారి సీట్ల అంచున నిలుచోబెడుతాయి.. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ , క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి థ్రిల్లింగ్ క్షణంలో వారి కృషి కనిపిస్తుంది.
కీలక సన్నివేశాల ఇంపాక్ట్‌ని పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్. ముఖ్యంగా జాతర సీక్వెన్స్‌లో సంగీతం ప్రేక్షకులకు మెస్మరైజ్ చేస్తుంది.
జగపతి బాబు, రావు రమేష్, అజయ్ , బ్రహ్మాజీ వంటి నటీనటులు తమ పరిధి మేరకు తమ పాత్రలను చక్కగా పోషించారు.
– మైనస్ పాయింట్లు:
బలమైన కథాంశాన్ని కోరుకునే వారికి పుష్ప 2 లోపంగా అనిపించవచ్చు. ఈ చిత్రం ఎక్కువగా కౌంటర్ సన్నివేశాలపై ఆధారపడి ఉంటుంది. రెండవ భాగంలో, కథ ఊహించని విధంగా కుటుంబ కోణంలోకి మారుతుంది,
రైటింగ్ డీసెంట్‌గా ఉన్నా, డెప్త్ లేదు, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో. కొన్ని సన్నివేశాలు సాగదీతలా కనిపిస్తాయి. కొన్ని డైలాగులు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
మొదటి భాగంతో పోలిస్తే, ఈ సీక్వెల్‌లోని పాటలు స్క్రీన్‌పై తక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి, సూసీటీ మినహా పాటలు ఆకట్టుకోలేదు.
తీర్పు:
మొత్తం మీద, పుష్ప 2: రూల్ అంచనాలను అందుకుంటుంది.. అల్లు అర్జున్ నటన, ఎమోషనల్ యాక్షన్-ప్యాక్డ్ అదిరిపోయేలా ఉంది. ఫహద్ ఫాసిల్ తన ప్రత్యేకమైన శైలితో పాత్రకు ఇంటెన్సిటీని తీసుకురాగా రష్మిక మందన్న కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో అనవసరమైన సన్నివేశాలు.. బలమైన కథాంశం లేకపోవడం వంటి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, రన్‌టైమ్ సమస్య కాదు. తొలి భాగంతో పోలిస్తే పుష్ప 2 అంచ నాలు పెంచింది. ఈ వారాంతంలో చూడదగిన యాక్షన్ డ్రామాను చూడొచ్చు. వెంటనే మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోండి.