
Allu Arjun : ఇటీవల అల్లు అర్జున్, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలలో రెండు స్టార్ హీరోలు పాల్గొన్నారని, వారి ఇద్దరికీ కథ నచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ సినిమా, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.