
Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ఈవెంట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు. అల్లు ఫ్యామిలీకి కూడా निमంత్రణ పంపినా, కేవలం అల్లు అరవింద్ మాత్రమే హాజరయ్యారు. అల్లు అర్జున్ రాకపోవడం వెనుక రాజకీయ విభేదాలేనా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, ఆయన అభిమానులు మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తున్నారు.
వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాకోసం విదేశాల్లో ఉన్నారని, తన మేకోవర్ పై దృష్టి పెట్టి సిక్స్ ప్యాక్ బాడీ తయారీతో పాటు లుక్ మార్పు మీద పనిచేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆహ్వానానికి నాగార్జున, గత విభేదాలు పక్కనపెట్టి, సతీమణి అమలతో కలిసి హాజరుకావడం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.






