Allu Arjun wife : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణకు చెందిన స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్. తన చాలా వ్యాపారాల్లో స్నేహారెడ్డి అన్ని చూసుకుంటోంది. కాలేజీతో పాటు ఇతర వ్యాపారాలను కూడా స్నేహారెడ్డి మాత్రమే హ్యాండిల్ చేస్తుంది.
అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కొడుకు, కూతురును తీసుకొని కుటుంబ సమేతంగా చాలా కార్యక్రమాలకు హాజరవుతుంటారు. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటుంది. ఎక్కడ ఏం చేస్తున్నా.. ఇన్ స్టాగ్రాంలో పోస్టులు పెడుతుంటుంది.
హీరోయిన్లకు తీసిపోని అందంతో ఆమె నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇన్ స్ట్రాగ్రామ్ లో 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సూపర్ వదినా బాగా చేస్తున్నావ్.. బాగా కష్టపడుతున్నావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫిట్ నెస్ కాపాడుకోవడంతో ఎంతో శ్రద్ధ చూపిస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా తుది దశ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం అయితే పుష్ఫ 2 సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా.. పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన గొడవతో నిర్మాతలు డిసెంబర్ ఆరో తేదీకి ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ ను కాదని అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి వెళ్లాడు. దీంతో అతడిపై పవన్ కల్యాణ్ అభిమానులు నోరు పారేసుకున్నారు. కాగా మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ తనెంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు.