Allu Arjun :
మన తెలుగులో తెలుగు హీరోయిన్ల ప్రాధాన్యం కనిపించడం లేదు. ఎప్పటి నుంచో పరభాషా భామలే మన చిత్ర సీమను ఏలుతున్నారు. దీంతో తెలుగు హీరోయిన్లను మనం వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. దీంతో మన వారికి అన్యాయం జరుగుతోందని ప్రముఖ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. బేబి సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
బేబి సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగు వనిత వైష్ణవి చైతన్య రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. మన తెలుగు వారికి ఆదరణ దక్కడం లేదు. అందుకే మన వారు కూడా ఇతర భాషల్లో రాణిస్తున్నారు. అక్కడ ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఇక్కడ మాత్రం తగిన గుర్తింపు దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే పక్క రాష్ట్రాల వారి ఆధిపత్యం పెరుగుతోంది.
సైమా, ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలలో కూడా పరభాష హీరోయిన్లు తెలుగు సినిమా అవార్డులు తీసుకోవడం గమనార్హం. మన పరిశ్రమకు చెందిన తెలుగు అమ్మాయిలు రావడం లేదని ఆయన మాటల్లో అర్థం. ఈ నేపథ్యంలో ఆయన మాటలు అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవానికి విలువే లేకుండా పోతోందని ఆయన మాటల్లో అంతరార్థం.
అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి లాంటి వారు తమిళంలో రాణించాక మన భాషకు వచ్చారు. ఎందుకు మనం తెలుగు వారిని అక్కున చేర్చుకోవడం లేదని వాదిస్తున్నారు. మన వారిని కూడా ఆదరిస్తే మనకు మంచి గుర్తింపు వస్తుంది కదా అంటున్నారు. బోభిత ధూళిపాళ్ల కూడా బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. ఇప్పుడు మన తెలుగు హీరోయిన్లకు కూడా ఆదరణ దక్కితే మంచిది.