
Allu Arvind Magic Words : నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వారు 2017 లో మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వారి మధ్య లవ్ నడుస్తున్నట్లు టాక్. అందుకే వారు ఇన్నేళ్లు ప్రేమించుకుని ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. లావణ్య గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చావుకబురు చల్లగా అనే సినిమాలో కార్తికేయ జంటగా నటించింది.
అప్పటి నుంచే అల్లు అరవింద్ కు పరిచయం. ఆ సినిమా ప్రమోషన్ లోనే అల్లు అరవింద్ ఒక మాట అన్నాడట. ఉత్తరాదికి చెందినది అయినా చక్కగా తెలుగు నేర్చుకుంది. ఇక ఇక్కడి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే సరి అనేశాడట. ఇప్పుడు ఆయన అన్న మాటలు నిజం అవుతున్నాయి. తన బావ కొడుకునే చేసుకోబోతోంది. ఆనాడు ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ ఆయన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి.
నార్త్ అమ్మాయి అయినా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. అందుకే మన వరుణ్ ను చేసుకుంటోంది. అల్లు అరవింద్ మాటల్లో మహత్తు ఉందో ఏమో తెలియదు కానీ ఆయన అన్న మాటలు మాత్రం నిజం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ మాటల్లో ఏదో తెలియని శక్తి ఉందని పలువురు చెబుతున్నారు. మొత్తానికి వరణ్, లావణ్య జంటకు త్వరలో పెళ్లి చేయనున్నారు.
జూన్ 9న హైదరాబాద్ లోని మణికొండలో నాగబాబు నివాసంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం జరిగింది. మెగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం షూటింగ్ బిజీలో ఉండి రాలేకపోయారు. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.






