
Peddi : రామ్ చరణ్ నటించిన “పెద్ది” టీజర్‌పై అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ స్పందించారు. “పెద్ది ఫస్ట్ షాట్ మామూలు రేంజ్‌లో లేదుగా.. హ్యాపీ శ్రీరామనవమి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఇది అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి అభిమానుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో శిరీష్ పాజిటివ్‌గా స్పందించడంతో కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రామ్ చరణ్ నిన్ను కూడా కొనేశాడా?” అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు “మీ సినిమాల టీజర్లు వచ్చినప్పుడు రామ్ చరణ్ స్పందించలేదే” అంటూ ప్రశ్నిస్తున్నారు.