30.9 C
India
Saturday, May 17, 2025
More

    Viagra Tablets : అంగస్తంభన చక్కగా ఉన్నా వయాగ్రాలు విరివిగా వాడేస్తున్నారు..  

    Date:

    Viagra Tablets
    Viagra Tablets

    Viagra Tablets : వాస్తవానికి అంగస్తంభన సమస్య ఉన్న వారికి వయాగ్రా టాబ్లెట్లు చాలా బాగా ఉపయోగపడుతాయి. ఫాస్ఫోడైస్టెరేజ్‌ టైప్‌ 5 (పీడీఈ5) ఇన్‌హిబిటార్స్‌ రకానికి చెందిన ఈ టాబ్లెట్లు శృంగార భావన కలిగినప్పుడు అంగానికి రక్త సరఫరా వేగవంతం అయ్యేలా చేస్తుంది. దీంతో అంగం గట్టిపడి, సంభోగం సంతృప్తిగా జరిగేలా చూస్తుంది. అయితే ఇటీవల కాలంలో స్తంభన  సమస్య లేకపోయినా కొందరు వినోదం కోసం ఈ మందు బిళ్లను వేసుకోవటం ఎక్కువవుతోంది. ఎక్కువసేపు అంగం స్తంభించటానికి.. సామర్థ్యం గురించిన ఆందోళన, శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించుకునేందుకు ఇలా రకరకాల కారణాలతో దీన్ని జనాలు వాడుతున్నారు. అయితే స్తంభన లోపం గలవారికే ఇది మేలు చేస్తుంది. అనవసరంగా వాడితే లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకున్నట్లే.

    పీడీఈ5 ఇన్‌హిబిటార్స్‌ రక్తపోటును తగ్గిస్తాయి. అప్పటికే రక్తపోటు తగ్గటానికి వాడే మందులతో కలిస్తే ఇది ప్రమాదకరం. ఛాతీనొప్పి తగ్గటానికి ఇచ్చే నైట్రోగ్లిజరిన్, రక్తపోటును తగ్గించే ఐసోసార్బయిడ్‌ వంటి మందులతో ఐడీఈ5 ఇన్‌హిబిటార్స్‌ వాడితే చాలా డేంజర్.  అలాగే సిల్డినాఫిల్‌ సిట్రేట్‌తో తలనొప్పి తప్పించి పెద్దగా దుష్ప్రభాలేవీ ఉండవు. కానీ కొందరిలో ఛాతీ మంట, ముఖం ఎర్రబడటం, కండరాల నొప్పులు, ముక్కు బిగుసుకోవటం, చూపు మారటం వంటి దుష్ప్రభావాలూ కనిపిస్తాయి. చాలా అరుదే అయినా కొందరికి ఎక్కువసేపు అంగం గట్టిపడి అలాగే ఉండిపోతుంది. అప్పుడు అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. కేవలం విశ్వాసం పెరగటం కోసమే తరచూ స్తంభన మాత్రలు వాడితే మానసికంగా వాటిపై ఆధారపడే పరిస్థితి తలెత్తొచ్చు. పోను పోనూ మాత్రలు వేసుకోకపోతే సంభోగం జరపలేని స్థితికి చేరుకోవచ్చు. డాక్టర్‌ సిఫారసు లేకపోయినా దుకాణాల్లో స్తంభన మాత్రలు అమ్ముతుంటారు. డాక్టర్‌ సిఫారసు చేయకుండా ఇష్టారీతిలో మాత్రలు వేసుకోకూడదు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    శృంగార సామర్థ్యాన్ని పెంచే పుచ్చకాయ తొక్క

    ప్రస్తుత రోజుల్లో శృంగార వాంఛలు తగ్గుతున్నాయి. మనం తినే ఆహారాలతో మనకు...