
Amala Paul : Is అమలాపాల్ అంటే దేశ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ అమ్మడు అందం, అభినయం సమపాళ్లలో ఉన్న సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ.. ఈ భామ ఒకప్పుడు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో మెగా హీరోల సరసన నటించే లక్కీ ఛాన్స్ వరుసగా అందుకుని అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.
వరుసగా మెగా హీరోలతో చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి.. అయితే ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడే సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న తరుణంలో ఈ అమ్మడు కే ఎల్ విజయ్ అనే డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి పెళ్లి కొద్దిరోజుల్లోనే విడాకులతో ముగిసింది.
ఆ తర్వాత ఈ భామ మళ్ళీ కెరీర్ మీద ద్రుష్టి పెట్టి ఏకంగా బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరికి షాక్ ఇస్తుంది.. అంతేకాదు ఆడై సినిమాలో ఏకంగా న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడు కూడా కొంత విమర్శల పాలు అయ్యింది. ఈ భామ తరచు ఏదొక వివాదం ద్వారా వైరల్ అవుతూనే ఉంది.. మరోసారి ఈ భామను నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.
అందుకు కారణం ఏంటంటే ఇటీవలే గ్యాంబ్లింగ్ క్రీడ క్యాసినో బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఆ కంపెనీ పార్టీలో పాల్గొంది.. ఈ పార్టీలో ఈ భామ అసభ్యంగా డ్రెస్ ను ధరించి అత్యంత దారుణమైన గెటప్ లో కనిపించింది..
అలాగే ఈ పార్టీలో ఈమె ఫుల్ మూడ్ లో చిందులు వేయగా ఆ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. క్లివేజ్ మొత్తం కనిపించేలా అలాగే థైస్ అందాలతో కొద్దిగా అసభ్యంగా కనిపించింది. ఈ గెటప్ ను చుసిన నెటిజెన్స్ డబ్బు కోసం ఏమైనా చేస్తావా.. ఎంతకైనా దిగజారుతావా.. ఇంత చిల్లర వేషాలు ఎందుకు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.






