
Shani Jayanti : ఈ సంవత్సరం శని జయంతి మే 27, మంగళవారంన వైశాఖ బహుళ అమావాస్య నాడు జరుపబడుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శుభపూటగా పూజకు అనుకూలంగా ఉంటుంది.
పూజా విధానం:
సూర్యోదయానికి ముందు స్నానం చేసి శుద్ధిగా ఉండాలి.
సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాస సంకల్పం చేయాలి.
ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
నవగ్రహాల దేవాలయంలో శనిదేవునికి తైలాభిషేకం చేయించాలి.
నల్ల వస్ర్తం, నల్ల నువ్వులు సమర్పించాలి.
తమలపాకులో బెల్లం సమర్పించి దీపారాధన చేయాలి.
బ్రాహ్మణులకు దక్షిణ, తాంబూలం ఇవ్వాలి.
దానాలు చేయవలసినవి:
పేదలకు అన్నదానం, వస్త్ర దానం.
కాకులకు, నల్ల చీమలకు ఆహారం.
వృద్ధులు, గురువులకు సేవ.
రోగులకు పండ్లు, పాలు, మందులు దానం.
పాటించాల్సిన నియమాలు:
మద్య మాంసాలను నివారించాలి.
ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి.
బ్రహ్మచర్యం పాటించాలి.
శనిదేవుని అనుగ్రహంతో శుభాలూ, శాంతి, ఆనందాలు మీ జీవితంలో నింపబడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు!