Rudolph Blaise రుడాల్ప్ ఇంగ్రామ్ ఒక యువ అమెరికన్ అథ్లెట్. ఫుట్ బాల్ ఆటగాడు కూడా. ఇతడిని బ్లేజ్ అనే నిక్ నేమ్ తో పిలుస్తుంటారు. స్ప్రింట్ లో అతడికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రుడాల్ఫ్ 100 మీటర్ల రేసులో 13.48 సెకన్లలో పరిగెత్తి రికార్డు సృష్టించాడు. దీంతో పాటు ఈఎస్పీఎన్ రికార్డును బద్దలు కొట్టాడు. 60 మీటర్ల ను కేవలం 8.96 సెకన్లలో పూర్తి చేశాడు. తన ఫిట్ నెస్ చూసి చాలా మంది ఆటగాళ్లు ఆశ్చర్య పోతుంటారు. ఇప్పటికే ఈ బాలుడు ఎన్నో ట్రోఫీలను గెల్చుకున్నాడు. ఇంటర్నెట్ లో ఈ బాలుడిని మినీ ఉసేన్ బోల్ట్ గా సంబోంధిస్తున్నారు.
రుడాల్ఫ్ ను తదుపరి ఉసేన్ బోల్డ్ అని కూడా పిలుస్తారు. రుడాల్ప్ నాలుగేండ్ల వయస్సులోనే రన్నింగ్ శిక్షణ తీసుకున్నాడు. స్ప్రింటర్ గా కాకుండా పాఠశాల స్థాయిలో ఫుట్ బాల్ ఆడేందుకే ఆ కుర్రాడు ఇష్టపడ్డాడు. టంపా రావెన్స్ ఫుట్ బాల్ ఆర్గనైజేషన్ కోసం ప్రస్తుతం ఆడుతున్నాడు. ఇప్పటికే మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, హీస్మాన్ అనే అవార్డులను కూడా అందుకున్నాడు. అతడి తండ్రి రుడాల్ప్ ఇంగ్రామ్ సీనియర్, ఒక శిక్షకుడు, ఫిట్ నెస్ కోచ్. రుడాల్ఫ్ ఇన్ స్టాగ్రాం ఖాతాను కూడా నిర్వహిస్తున్నాడు. రుడాల్ఫ్ కు ఇన్ స్టాలో సుమారు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
రుడాల్ప్ ఒక వ్యాఖ్యాన్ని ఎప్పుడూ చెబుతుంటాడు. మొదట మనం మానసికంగా గెలవాలి. ఆ తర్వాతే శారీరకంగా గెలవాలి అని. ప్రస్తుతం తను అన్ని రకాలుగా ఆటలో రాటుదేలుతున్నాడు. అమెరికన్ ఫుట్ బాల్ అంటే కూడా రుడాల్ప్ కు చాలా ఇష్టం . ఆ ఆటను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ బాలుడి హార్డ్ వర్క్ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నది. రానున్న రోజుల్లో అతడో పెద్ద చాంపియన్ గా ఈ ప్రపంచం ముందు నిలిచే అవకాశం కూడా ఉంది. అంత కఠోర సాధన చేస్తున్నాడు. ప్రపంచంలోని ఎందరో సీనియర్ అథ్లెట్ల నుంచి ప్రస్తుతం రుడాల్ప్ ప్రశంసలు అందుకుంటున్నాడు.