Lord Ganesh pictures : మనకు ఆదిదేవుడు గణేషుడు. ప్రతి సంవత్సరం బాధ్రపద మాసం చతుర్థి రోజు వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీ. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ అత్యంత ఘనంగా జరుపుకోవడం సహజం. దీంతో మనం దేవుడిని పూజించి మన కోరికలు తీర్చాలని వేడుకుంటాం. విఘ్నాలు తొలగించే దేవుడిని వాడవాడలా ప్రతిష్టించి వేడుకలు జరుపుకుంటాం.
ఈక్రమంలో బెంగుళూరుకు చెందిన ఓ ఆర్టిస్ట్ గణేషుడు బొమ్మలు వేసి ఆశ్చర్యపరచింది. రమాదేవి అత్యం దేవుడి బొమ్మలను అందంగా చిత్రీకరించారు. ఆమె సహజంగానే పెయింటర్ కావడంతో వినాయక ప్రతిమలను అందంగా చూపించారు. ఆ ఫొటోలను జేఎస్ డబ్ల్యూ టీవీకి పంపించారు. దీంతో విఘ్నేశుడి ఫొటోలు నెట్టింట్లో అలరిస్తున్నాయి.
ఆమె నైపుణ్యం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. అద్భుత కళాఖండాలు తయారు చేసిన ఆమె టాలెంట్ కు అందరు ఆసక్తి చూపిస్తున్నారు. గణపతి చిత్రాలను మంచి కళారూపాలుగా తయారు చేశారు. కళాకారులకు కొదవ లేదు. కానీ అందమైన చిత్రాలు వేయడం అందరికి సాధ్యం కాదు. అందుకే వినాయకుడి చిత్రాలు అందరిని ఎంతో ఆకర్షిస్తున్నాయి.
మనకు ఇష్టమైన దేవుడిగా వినాయకుడు ఉండటం సహజమే. అందరు దేవుళ్ల కంటే ముందు కొలిచేది వినాయకుడినే. అందుకే ఆయనను కొలవడం అందరికి ఇష్టమే. ఆయన రూపాలను పలు కోణాల్లో వేసిన రమాదేవి ప్రతిభకు అందరు ఫిదా అవుతున్నారు. వినాయకుడి బొమ్మలను చూస్తూ మురిసిపోతున్నారు. ఆమె టాలెంట్ ను ప్రశంసిస్తున్నారు.