అప్పుడెప్పుడో బామ్మ మాట బంగారు బాట అనే చిత్రంలో సూపర్ కార్ …… సూపర్ కార్ అంటూ ఓ విచిత్రమైన కారును చూసాం. అది సినిమా కోసం క్రియేట్ చేసిన సూపర్ కార్ కాగా ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎంతగా మదనపడితే అంతగా కొత్త కొత్త వింతలు పుట్టుకొస్తూనే ఉంటాయి….. అంటే బ్రెయిన్ కు పని పెట్టడమే అన్నమాట. మానవుడు ఎన్ని కనిపెడుతున్నప్పటికి సరైన సాటిస్ ఫ్యాక్షన్ ఉండటమే లేదు…… మరింత వింత ప్రపంచాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. తాజాగా అలాంటి ఉదాహరణే….. మెర్సిడెస్ కు చెందిన సూపర్ కార్.
సూపర్ కార్ బ్లాండీ వండర్స్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సుందరంగా ఈ సూపర్ కార్ ను సృష్టించారు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న సూపర్ కార్ ను చూసి ఆశ్చర్యచకితులౌతున్నారు. యావత్ ప్రపంచమే ఈ సూపర్ కార్ ను చూసి సంభ్రమాశ్చర్యలకు లోనౌతోంది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్భుతమైన ఫీచర్స్ తో ఉన్న ఈ సూపర్ కార్ బ్లాండీలో ప్రయాణించాలనే కుతూహలం నెలకొంది. ఇక ఈ కారుకు స్టీరింగ్ లేదు సుమా! స్టీరింగ్ లేకపోవడం ఏంటి అని అనుకుంటున్నారా ? స్టీరింగ్ కు బదులుగా మౌస్ లాంటి పరికరం ఇచ్చారు.
అంటే కంప్యూటర్ ను ఆపరేట్ చేయాలంటే మనం మౌస్ ను ఎలాగైతే ఉపయోగిస్తామో అలా అన్నమాట. మౌస్ లాంటి పరికరంతో ఈ కారును డ్రైవ్ చేయొచ్చు. చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు ధర ఎంతో తెలుసా…… 15 నుండి 17 అమెరికన్ మిలియన్ డాలర్లు అని అంటున్నారు. ఇంత అందంగా , సుందరంగా ఉంది కాబట్టే మెర్సిడెస్ ఈ భారీ మొత్తాన్ని ఖరీదుగా పెట్టింది. మీరూ ఈ కారును చూడండి…… సంభ్రమాశ్చర్యలకు లోనవ్వడం ఖాయం సుమా !