24 C
India
Sunday, October 11, 2026
More

    Ambati Tweet : పవన్ పై అంబటి ట్వీట్ నీకు కాళరాత్రి.. నాకు సంక్రాంతి అంటూ సెటైర్

    Date:

    Ambati tweet about Pawan
    Ambati tweet about Pawan

    Ambati Tweet :

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తనదైన సెటైర్ వేశారు. గత ఎన్నికల ముందు వైసీపీని గెలవనీయను అంటూ శపథాలు చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోనే ఉంటానని చెప్పి  నిలబడిన రెండు చోట్లా ఓడిపోయాడు. మళ్లీ సినిమాల బాట బ‌ట్టి ప్రత్యర్థులపై తన సినిమాల్లో సెటైర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
    తన సామాజిక వర్గమైన వ్యక్తి మంత్రిగా ఉన్నార‌ని కోపమో లేక తాను మాట్లాడే ప్రతి మాటకు ఎదురు మాట్లాడతారనో మైక్ క‌న‌ప‌డ‌గానే  అంబటి రాంబాబుపై సెటైర్లు వేసే పవన్ కల్యాణ్ తాజాగా త‌న‌ సినిమాలో కూడా ఆయ‌న‌పై సెటైర్లు వేశారు. తాజాగా ప‌వ‌న్ ఓవరాక్షన్ పై మంత్రి అంబ‌టి రాంబాబు మరోసారి కౌంట‌ర్ వేశారు. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి!.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి!’ అంటూ ట్వీట్ చేశారు.
    గ‌త సంక్రాంతి పండుగ సందర్భంగా అంబ‌టి రాంబాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. సరిగ్గా అప్పుడు అంబటి వేసుకున్న డ్రెస్ నే, ప‌వ‌న్ త‌న‌ సినిమాలో పృథ్వీకి వేయించాడు. దాదాపు అలాంటి స్టెప్పుల్నే వేయించారు. దానికి ప‌వ‌న్ నీతులు చెప్పి మురిసిపోయారు. పవన్ కల్యాణ్ ర్యాగింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ జనసైనికులు సంబర పడుతుంటే, రాజకీయాల్లో చేసేదేం లేక, ఇలా సినిమాల్ని అడ్డం పెట్టుకొని పవన్ స్వయం తృప్తి పొందుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు.
    ఇలా అనవసరంగా అంబటిపై సినిమాల్లో సెటైర్లు పెట్టి ప‌వ‌న్‌ ఆనందం పొందాలనుకుంటే మంత్రి అంబటి మాత్రం రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌కు కాళ‌రాత్రి అంటూ బాగా బుద్ధి చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Irigela brothers Jana Sena : జనసేనలోకి ఇరిగెల సోదరులు.. ఆళ్లగడ్డ సీటు టీడీపీ వదులుకోవాల్సిందేనా..?

    Irigela brothers Jana Sena : ఏపీలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు...

    Sand Smuggling Case Against Chandrababu : చంద్రబాబుపై ఇసుక అక్రమ రవాణా కేసు

    Sand Smuggling Case Against Chandrababu : చంద్రబాబుపై మరో కేసు...