Anant Ambani : అంబానీ వారి ఇంట పెళ్లంటే మాటలా? ఆయన దేశంలోనే ధనవంతుడు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఆయన నిద్రపోయినా.. ప్రతి సెకనుకూ కోట్ల రూపాయలు సంపాదిస్తారు.. లక్షల కోట్లకు అధిపతి అయిన అంబానీ ఇంట పెళ్లంటే మాములుగా ఉండదు కదా. విందు భోజనం మెనూ చూస్తేనే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏకంగా 2 వేల 500 రకాల వంటకాలు తినడానికి రెడీ చేసిన విషయం తెలిసిందే.
గుజరాత్ లోని జామ్‌నగర్‌లో మార్చి 1,2,3 తేదీల్లో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల ప్రీ వెడ్డిండ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ మూడు రోజుల సెలబ్రేషన్స్ కు 1,000 మంది గెస్టులు హాజరుకానున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో 70 రకాల వంటకాలు, మధ్యాహ్నం భోజనంలో 250 ఫుడ్ ఐటమ్స్, రాత్రి డిన్నర్ లో 250 వంటకాలు తయారు చేయనున్నారు. ఇండియాలో స్టార్ క్రికెటర్లు, పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, ప్రముఖ సినీ నటులు ఈ ఫంక్షన్ కు వస్తున్నారు. ప్రపంచ ప్రముఖ ధనికులైన బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కూడా హాజరవుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ అనంత్, మర్చంట్ ల పెళ్లి ఖర్చు రూ.1000 కోట్లు అట. షాక్ అయ్యారా? ఇది నిజమే. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ పెళ్లిగా ఇది చరిత్ర తిరగరాయబోతోంది. అతిథులకు అరుదైన ఆతిథ్యం ఇవ్వడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఫర్వాలేదని ముఖేశ్ ఫిక్స్ అయ్యారట. అందుకే ఏకంగా రూ.1000కోట్లు(120 మిలియన్లు) ఖర్చు చేస్తున్నారట. అయితే ఎన్ని కోట్లు ఖర్చు చేసిన అంబానీ ఆస్తిలో తరిగేది ఏమి లేదట. ఆయన సంపాదనలో వెయ్యి కోట్లు అంటే కేవలం 0.1శాతం మాత్రమే.
అనంత్ పెళ్లి ఖర్చు వెయ్యి కోట్లు అనగానే అందరూ లెక్కల పనిలో పడ్డారు. ఒక్కో మ్యారేజ్ కు దాదాపు రూ.10లక్షల ఖర్చు వేసుకున్నా వెయ్యికోట్లతో ఏకంగా 10వేల వివాహాలు చేయవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్-రాధిక పెళ్లి వేడుక జరుగనుంది. ఇవాళ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో పాప్ సింగర్ రిహాన్నా పెర్మార్ఫ్ చేయనున్నారు. దీనికి ఆమె ఏకంగా 9 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 75 కోట్లు) తీసుకుంటున్నారు. అంటే ఒక్క సింగరే 75 కోట్లు తీసుకుంటున్నారంటే మిగతా ఖర్చులు ఏ రేంజ్ లో ఉంటాయో అంచనాకు రావొచ్చు.