
Ambati Rayudu : తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుంది. బొంతపురుగే సీతాకోక చిలుకగా మారుతుంది. అలా సినిమా, క్రికెట్లో రాణించిన వారు చివరకు రాజకీయాల్లో స్థిరపడతారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణగా మన ఎన్టీఆర్, జయలలితలనే తీసుకోవచ్చు. ఇలా రాజకీయాలు, సినిమాలు, క్రికెట్ కు దగ్గర సంబంధాలు ఉంటాయనడంలో సందేహం లేదు.
ఆంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ అంబటి రాయుడు గురించి అందరికి తెలుసు. ప్రస్తుతం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికార పార్టీ వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ ను కలుస్తున్నారు. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి బరిలో దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేయాలని చూస్తున్నారు. దీంతో అంబటి రాయుడు మచిలీపట్నం నుంచి గెలవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధి గురించి ప్రచారం చేస్తున్నారు.
టీడీపీపై విమర్శలు కూడా చేస్తున్నారు. రాజకీయంలో కూడా రాణించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలోనే గడపాలని నిర్ణయించుకున్నారు. అందుకే వైసీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ రాయుడి కోరిక తీరుతుందా? వైసీపీ టికెట్ ఇస్తుందా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.






