Ambati VS Pawan Kalyan :
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తరచూ కామెంట్లు చేస్తుంటారు. చంద్రబాబు పాటు పవన్పై తిట్లదండకం మొదలు పెడుతారు. అయితే తాజాగా వారాహి యాత్రలో బాగంగా వపన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు గెలువనివ్వమని సవాల్ విసిరారు. జగన్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. సంగతి తేలుస్తానని ఆవేశంతో ఊగిపోయారు. ఇప్పుడు వారాహి యాత్ర ముగిసింది.
ఇక వైసీపీ నేతల వచ్చింది. ఒక్కో నేత బయటకు వచ్చి పవన్ పై విమర్శలు మొదలు పెట్టారు. పవన్ అసలు మనిషేకాదని తిట్లదండకం మొదలు పెట్టారు. తాజాగా శనివారం మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు పెండ్లిళ్లు చేసుకున్న వ్యక్తి కూడా ఆదర్శ వ్యక్తి లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ మాట్లాడితే విప్లవం అంటున్నారని… ఆయన ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలని కోరారు. ఆయనం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని ఎద్దేవా చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దించాలని అంటున్నారని, మరి ఎవరు సీఎం కావాలో పవన్ చెప్పాలని కోరారు.ఆయనకే ఒక సరైన విధానం లేదని, యువత ఆయనను నమ్మితే మోసపోతారని పేర్కొన్నారు. అయితే గతంలో కూడా పవన్పై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆయనను జన సేన శ్రేణులు ఆయనను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మరి తాజా వ్యాఖ్యలతో అంబటి జనసైనికులు, పవన్ అభిమానుల నుంచి ఎన్ని సెటైర్లు పడతాయో- చూడాలి.. అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలు కూడా ప్రెస్మీట్లు పెట్టి పవన్ ను విమర్శించేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు వెనుకాడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో కొంత అచితూచి వెళ్లడమే మంచిదని, యువతలో పవన్ కు ఉన్న శ్రేణి నేపథ్యంలో విమర్శలకు పోతే ఇబ్బందులు ఎదురవుతాయని బావిస్తున్నారు.