
American 248th Independence Day Celebrations : మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిన విషయం తెలిసిందే. అదే అమెరికాకు జూలై 4, 1776న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు మనం ఎలా అయితే సంబరాలు జరుపుకుంటామో అమెరికన్లు కూడా తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటారు.
పదమూడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాలు ‘‘ది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’’ అనే ఏకగ్రీవ ప్రకటనతో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. జూలై 4, 1776న, ఫిలడెల్ఫియాలోని వలసరాజ్యాల శకం రాజధానిలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌస్‌లో సమావేశమైన 56 మంది ప్రతినిధులు దీనిని ఏకగ్రీవంగా ఆమోదించారు.
అమెరికా.. 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి. ఇక్కడ స్థానిక ప్రజలే కాదు అనేక దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పండుగల జరుపుకుంటారు. అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. 1776 జూలై 4 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం, సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది.
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1787 సెప్టెంబరు 17 న రూపు దిద్దుకుంది. తరువాతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791 న ప్రాథమిక పౌర హక్కులు, స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది. ప్రచ్ఛన్న యుద్ధం చివర సోవియట్ సమాఖ్య పతనంతో అమెరికా నేటి ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.
కాగా, జూలై 4న వుడ్ బ్రిడ్జ్ మేయర్ జాన్ మాకర్ మాక్ ఆధ్వర్యంలో అమెరికా ఇండిపెండెన్స్ డే 248వ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా ఆల్బర్ట్ దసానీ గుజరాతీకి చెందిన రెస్టారెంట్ వ్యాపారి (రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ , ఎడిసన్ లో రెస్టారెంట్ ) ఉన్నారు. ఆయన 1,50,000 డాలర్లు డొనేట్ చేసి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం విశేషం. అందులో భాగంగా ఫైర్ డిపార్ట్ మెంట్ కు, నార్కొటిక్స్ డిపార్టెమెంట్ కు, సీనియర్ సిటిజన్లకు మిగతా అందరికీ ఈ ఈవెంట్ సందర్భంగా డొనేట్ చేశారు. ఫుడ్, డ్రింక్స్ కూడా ఈయన స్పాన్సర్ చేశారు.
న్యూజెర్సీలో బిగ్గెస్ట్ రెస్టారెంట్ వ్యాపారి అయిన ఆల్బర్ట్ దసానీ అనేక కార్యక్రమాలకు విరాళం అందిస్తుంటారు. తెలుగు ఆర్గనైజేషన్స్ ఇండియన్ సెలబ్రేషన్స్ కు విరాళాలు ఇస్తూ తన దాతృత్వ హృదయాన్ని చాటుకుంటుంటారు. అమెరికాకు సంబంధించిన ఈవెంట్స్ ను ఆయనకు చెందిన 8 హాల్స్ లో నిర్వహిస్తుంటాడు. ఇవి అమెరికాలోనే పేరుమోసి రెస్టారెంట్స్ అని చెబుతుంటారు.
ఈ కార్యక్రమంలో వీరు భాయ్ పటేల్ (వుడ్ బ్రిడ్జ్ సిటీకి కౌన్సిల్ మెంబర్), ఆర్గనైజర్లు ముఖేష్ కాశీవాలా, దీపక్, తదితర భారతీయులు భారీగా, పలువురు ఆర్గనైజర్స్, వుడ్ బ్రిడ్జ్ సిటీకి చెందిన అన్ని డిపార్ట్ మెంట్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ పాల్గొన్నారు. వేడుకల్లో ఇండిపెండెన్స్ డే విశిష్టత గురించి మాట్లాడారు. దాదాపు 10వేల మంది వరకూ ఇందులో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేసిస్ ఫైర్ వర్క్స్. న్యూయార్క్ లో ఇది చాలా ఫేమస్. మొత్తం అమెరికాలోనే ఇది స్పెషల్ అట్రాక్షన్ గా చెప్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఎండాకాలం అయినా ఈవెనింగ్ టైంలో చాలా ఆహ్లాదంగా వాతావరణం ఉండడంతో అందరూ ఎంజాయ్ చేయడం విశేషం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికాలోని ప్రతీ నగరంలోనూ బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేస్తుంటారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : American 248th Independence Day Celebrations in New Jersey