
Saikiran Chikine : తెలుగు వారు అమెరికాలో సత్తా చాటుతున్నారు. అందుగలదు ఇందులేదంటూ అమెరికా కంపెనీలకే సారథ్యం వహించేలా ఎదిగారు. ప్రపంచంలోనే సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ ను నడిపించేది మన తెలుగు వాడు సత్య నాదెళ్ల.ఇక గూగుల్ కు సీఈవో మన పక్క రాష్ట్రం సుందర్ పిచాయ్. భారతీయుల ప్రభకు అమెరికా వెలిగిపోతోంది. ఇదే కాదు తెలుగువాళ్లు వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. నేటికి కొనసాగుతున్నారు. తాజాగా JSWTV and Jaiswaraajyatv web papers & Tv channels గ్లోబల్ డైరెక్టర్ డా. శివకుమార్ ఆనంద్ చికినె గారి కుమారుడు సాయికిరణ్ చికినె అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. ఎంతో ప్రెస్టీజియస్ ‘నేషనల్ డిఫెన్స్ ఫెలోసిప్’ను సాధించాడు.

అమెరికాలోని కొలరొడో రాష్ట్రంలోని బౌల్డర్ యూనివర్సిటీలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో సాయికిరణ్ ఈ ఫెలోషిప్ సాధించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కు ఐదుగురు ఎంపికవ్వగా.. అందులో మన సాయికిరణ్ ఒక్కడు కావడం విశేషం. అందరిలోకి మెరిట్ సాధించి మూడు సంవత్సరాల ఫెలోషిప్ ను దక్కించుకోవడం గమనార్హం. ఇది కేవలం అమెరికాలో ఉన్న యువ సైంటిస్టులకు ఇంజనీర్లకు మాత్రమే అందజేస్తారు.
సాయికిరణ్ చికినె ప్రస్తుతం బౌల్డర్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఈ ఫెలోషిప్ కు ఎంపికైన ఐదుగురిలో సాయికిరణ్ ఒకడు. అంతరిక్ష విమానం కు సంబంధించి సాయికిరణ్ చికెనే అత్యుత్తమ ప్రతిభకు ఈ గౌరవం దక్కింది.

కాగా సాయికిరణ్ తండ్రి శివకుమార్ చికినె కూడా పీహెచ్డీ పూర్తి చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద పర్సనల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలో సిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులతో ఆయనకు పరిచయం ఉంది. ఆయన ప్రస్తుతం జై స్వరాజ్య టీవీ, జై స్వరాజ్య వెబ్ పేపర్స్ మరియు టీవీ చానెల్స్ కు గ్లోబల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
కాగా, సాయి కిరణ్ కు అమెరికా జాతీయ ఫెలోషిప్ రావడం పై పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తండ్రి డా. శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సాయికిరణ్ సాధించాలని ఆకాంక్షించారు.
తల్లి ఉమాదేవి,పాప శివానీ.. సాయికిరణ్ ప్రతిభ గురించి గర్వపడుతున్నారు. నాన్న శివకుమార్ బాటలో కూతురు శివానీ న్యూయార్క్ యూనివర్సిటీలో సినిమాటోగ్రఫీ విద్యనభ్యసిస్తోంది. నాన్న గారి నైపుణ్యతను పునికిపుచ్చుకొని సినిమాటోగ్రఫీలో మరింతగా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. తల్లిదండ్రులుగా వీరి ప్రతిభకు శివకుమార్ దంపతులు గర్వపడుతున్నారు.