Indian National Song : ‘ఏ దేశం ఏగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని రాయప్రోలు సుబ్బారావు ఆనాడు చెప్పాడు. నేడు భారత పౌరులు ఇతరదేశాల్లో తమ దేశం కీర్తిని పొగడడం లేదు.. ఆ దేశ వాసులతోనే భారత కీర్తిని పొగిడిస్తున్నారు.. ఇటీవల అమెరికాలో అమెరికన్లు ‘నా తల్లి భూమి భారతిని’ పొగడడం చూస్తే ప్రతీ భారతీయుడిని నిజంగా గూజ్ బంబ్స్ అనే చెప్పాలి.
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో రవిశంకర్ గురూజీ అమెరికాలోని వాషింగ్టన్ లో ప్రపంచ సంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు తొలిరోజు (సెప్టెంబర్ 30) వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత జాతి సంస్కృతిక విశేషాలు, సంస్కృతిక సంబురాలు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. మూడు రోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆ దేశ ప్రభుత్వంతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి.
ఇందులో మొదటి రోజు (సెప్టెంబర్ 30) ప్రదర్శనలు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో 300 మంది అమెరికన్లు భారత దేశ జాతీయ గీతం అయిన ‘వందే మాతరం’ను అమెరికన్లు 300 మంది కలిసి ఆలపించారు. ప్రారంభ వేడుకల్లో ఈ పాట వీక్షకులకు వీనుల విందు చేసింది. అంత మంది విదేశీయులు భారత జాతి గీతాన్ని పాడడం నిజంగా అద్భుతంగా ఉందని భారతీయుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కొందరు X (ట్విటర్) ద్వారా దీన్ని షేర్ చేశారు.
300 Americans join @chandrikatandon in this beautiful rendition of the Vande Mataram at the Art of Living’s World Culture Festival in Washington DC, and listening to it gave us goosebumps!! #WorldCultureFestival #WCF2023 pic.twitter.com/lOLdD0oO9I
— The Art of Living (@ArtofLiving) September 30, 2023