Amisha sensational comments :
అమీషా పటేల్.. ఈ భామకు భారీ క్రేజ్ ఉంది.. బాలీవుడ్ లో ఈమె కెరీర్ ను స్టార్ట్ చేసి తక్కువ సమయం లోనే ఫేమస్ అయ్యింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన నటించింది.. ఆ తర్వాత మహేష్ తో కూడా నటించి మెప్పించింది.
అయితే ఈమెకు టాలీవుడ్ మరిన్ని అవకాశాలు ఇవ్వలేదు.. దీంతో మళ్ళీ బాలీవుడ్ కు చెక్కేసింది.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.. అయితే కెరీర్ విషయం పక్కన పెడితే ఈ భామకు ఇప్పటికే 40 ఏళ్ళు వచ్చాయి.. అయిన ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ఈ విషయంపై తాజాగా ఈ భామ స్పందించింది. అమీషా బాలీవుడ్ లో తాజాగా నటించిన గదర్ 2 ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కెరీర్ గురించి మాత్రమే కాదు పెళ్లి గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే విషయం తెలిపింది.
”అప్పట్లో ఫేమస్ డైరెక్టర్ విక్రమ్ భట్ కు సర్వస్వం అర్పించుకున్నాను అని ఇద్దరం చాలా కాలం పాటు సహజీవనం చేసాం.. అదే నేను చేసిన తప్పు.. అప్పటి నుండి నాకు అవకాశాలు రాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ మగ వాళ్లకు దూరంగా ఉంటున్నాను”.. అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనం రేకెత్తిస్తున్నాయి.. 6 ఏళ్ల పాటు సహజీవనం తర్వాత వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటి నుండి ఈమెకు ఆఫర్స్ రాలేదు.