Helicopter For Agriculture :
వ్యవసాయం అంటేనే ఎన్నో కష్టనష్టాలు. ఆరుగాలం పండించిన పంట అన్ని కలిసివస్తేనే చేతికి. ప్రకృతి సహకరించకున్నా, కల్తీ కాటేసినా ఇక నిండా మునిగిపోవుడే. చాలా రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి. ఎన్నో బీడు భూములుగా మారి, ఎందరో రైతులు కూలీ పనులకు వలస వెళ్లడం మనం చూస్తునే ఉన్నాం. అయితే కొన్ని రాష్ర్టాల్లో ఇందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. ఎవరికీ సాధ్యం కాని పంటలను తీస్తున్నారు. ముఖ్యంగా కొందరైతే టెక్నాలజీ వాడుకొని పంటలు పండిస్తున్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని మన పెద్దలు చెప్పారు. అలాంటి రైతులు చాలా వరకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు భూములను అప్పుల కింద తాకట్టు పెడుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్ పేరిటా ఇక వ్యాపారం చేస్తున్నారు.
అయితే ఎస్ బీఐ ఉద్యోగి అయిన రాజారాం త్రిపాటి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1998 లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. రూ. 25 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రాజారం తాను పండించిన నల్ల మిరియాలను ఐరోపా, అమెరికాలకు ఎగుమతి చేస్తున్నాడు, పంటల సాగులో ఆస్ర్టేలియా విధానాలను పాటిస్తున్నాడు. ఈ హెలికాప్టర్ నడిపేందుకు తనకు, తన కొడుకు, సోదరుడికి ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీ శిక్షణనిస్తున్నట్లు స్వయంగా రాజారాం తెలిపాడు. చూశారా.. వ్యవసాయం పండుగలా చేసుకుంటున్న ఈ రైతు. తనకున్న వనరులను కాపాడుకుంటే ఎంత సాధిస్తున్నాడో.. ఏకంగా హెలికాప్టర్ కొని వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. రియల్లీ గ్రేట్ రాజారాం జీ.