
క్రికెటర్ ఎంఎస్ దోని దంపతులు, సచిన్ టెండూల్కర్ దంపతులు, బాలీవుడ్ అగ్ర తారలు ఈ ఫ్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జులై 12న ముంబైలోని బాంద్రాలోని కుర్లీ కాంప్లెక్స్ లో జియో వరల్డ్ కన్వెన్షన్ లో జరగనుంది. అయితే ఈ పెళ్లి పత్రికను నీతా అంబానీ కాశీ విశ్వేశ్వరుడి వద్దకు తీసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న చాట్ బండార్ ను చూసి ముచ్చటపడిందంటా.. ఈ చాట్ బండార్ కు సంబంధించిన ప్రత్యేక ఫుడ్స్ అన్నీ అనంత్ అంబానీ పెళ్లిలో పెట్టాలని నిర్వాహకుడిని కోరిందంటా.. చాట్ బండార్ నిర్వాహకుడు కేసరి దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఫ్రీ వెడ్డింగ్ లో లేని చాట్ బండార్ లోని అనేక రకాల ఐటంలు ఇక్కడ అతిథులకు వడ్డించనున్నారు.
వారణాసిలోని కాశీ చాట్ బండార్ ను చూసిన నీతా అంబానీ తన కొడుకు పెళ్లిలో ఈ స్టాల్ పెట్టించాలని నిర్ణయం తీసుకుంది. చాట్ కచోరీ, పాలక్ చాట్, టమాట చాట్, చాట్ కచోరీ లాంటి అనేక వెరైటీలను అతిథులకు పెట్టనున్నారు. జులై 12న శుభ్ వివాహ్, జులై 13న శుభ్ ఆశీర్వాద్, జులై 14 న మంగళ్ ఉత్సవ్ తో పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. ఈ పెళ్లి తతంగానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. మరి అంబానీ వారసులా పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి అని అనుకుంటున్నారు.