Anasuya clarity on the dispute with Vijay :
రౌడీ స్టార్ పోరాటం అనే వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది.. అర్జున్ రెడ్డి సినిమా సమయం నుండే విజయ్ ను టార్గెట్ చేస్తూ అనసూయ కామెంట్స్ చేస్తూనే ఉంది. దీంతో ఈ హీరోకు ఈ యాంకరమ్మకు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. దీంతో అనసూయపై విజయ్ ఫ్యాన్స్ మాములుగా ట్రోల్స్ చేయలేదు..
ఈ మధ్య కూడా విజయ్ దేవరకొండ పేరుకు ముందు ‘THE’ అని పెట్టుకున్నాడు అని ఆయన పేరు ప్రస్తావించకుండా ఈమె చేసిన ట్వీట్ తో మరోసారి ఈ భామ హాట్ టాపిక్ అయ్యింది. మళ్ళీ విజయ్ ఫ్యాన్స్ ఈమెను ట్రోల్స్ చేస్తూ ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు అనసూయ దీనికి ముగింపు పలుకుతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా ఈ భామ నటించిన విమానం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ తో తలెత్తిన వివాదంపై ఈమె స్పందించారు.. తనకు ప్రశాంతత కావాలని.. విజయ్ అభిమానులతో కోల్డ్ వార్ స్టార్ట్ అయినప్పటి నుండి తనకు ప్రశాంతత అనేది లేదు అని.. అందుకే ఈ గొడవను ఇక్కడితో వదిలేద్దాం అనుకుంటున్నా అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
ఈ వివాదం ఇంత పెద్దదిగా జరుగుతుంది అని విజయ్ కు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆయనతో క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి తనపై డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నాడు అని.. తనపై వ్యతిరేకతను కలిగేలా ప్రచారం చేయిస్తున్నాడని తెలిసింది అని ఆమె తెలిపారు.. విజయ్ తనను ద్వేషిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఆయనకు సంబందించిన విషయాలు ఇక నుండి మాట్లాడను అని.. ఈ గొడవను ఇక నుండి ఆపేసి ప్రశాంతంగా ముందుకు వెళ్లాలని నేను నిర్ణయం తీసుకున్న అని ఆమె తెలిపింది.
|
ReplyForward
|






