Anasuya VS Rashmi : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ వివాదంలోకి అనసూయ వచ్చింది. తనను విమర్శించిన వారిని ఒక ఆట ఆడుకుంది అమ్మడు. అలా.. ఇలా.. కాదు ఏకంగా పచ్చి బూతులు మాట్లాడుతూ ట్విటర్ ను ఆగమాగం చేసింది. సైలెంట్ గా కామెంట్లలోకి ఎంట్రీ అయిన అనసూయ ఇలా మాట్లాడడం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. ‘జంతు హింస’ గురించి ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే సోషల్ మీడియా వేధికగా రష్మీ స్పందిస్తుంది. తరచుగా ఇదే అంశంపై ట్వీట్స్ వేస్తోంది. దీంతో ఆమె కొన్ని సార్లు పెద్ద వివాదాల్లో కూడా చిక్కుకుంటుంది. ఒక్కో సారి అది మతపరమైన వివాదం కూడా కావచ్చు. ఈ అమ్మడు నెటిజన్లతో ఆర్గ్యూ మొదలు పెట్టిందంటే అంత తొందరగా ఆపదు. తాజాగా ఒకమతపరమైన పంచాయతీ పెట్టింది. అన్ని మతాల్లోని కుల వివక్ష గురించి ఆమె ఆర్గ్యూ చేసింది.
హిందూ మతంతో పాటు అన్ని మతాల్లో డివిజన్స్ ఉంటాయని చెప్పింది. హిందూ మతంలో వెనుకబడిన వర్గాలపై వివక్ష చూపుతుంటారు? అని నెటిజన్ ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు. చాలా మంది కన్వర్టెడ్ హిందువులు వారి హిందూ సంప్రదాయాలనే అనుసరిస్తున్నారని, కానీ వేరే మతాల సర్టిఫికేట్ ఎందుకు వాడుకుంటున్నారు అని రష్మీ కూడా నెటిజన్ ను ప్రశ్నించింది. ఈ వివాదంలోకి మరో నెటిజన్ యాంకర్ అనసూయను లాగాడు. ‘ఏది ఏమైనా రష్మీ గౌతమ్ ఇలాంటి అంశాలపై ధైర్యంగా మాట్లాడుతుంది అని అనసూయను విమర్శించాడు. దీంతో అనసూయ రెచ్చిపోయింది. ఏకంగా పచ్చి బూతులను వాడుతూ నెటిజన్ కి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది.
‘హలో.. మిమ్మల్ని సరిచేయనీయండి. నాకు ‘బాల్స్’ లేవు. కానీ అవగాహన ఉన్న అంశాలపై ధైర్యంగా మాట్లాడేందుకు ‘వజైనా’ ఉంది. మనం అంతా కొన్ని అంశాలపై ఎవరికి అనుకూలంగా వారిమి మాట్లాడతాం. ఎలాంటి విషయాలపై మాట్లాడాలి అనేది వారి పర్సనల్ ఛాయిస్. మీరు మాట్లాడే అంశాలపై అందరూ స్పందించాలనుకోవడం కరెక్ట్ కాదు అంకుల్’ అంటూ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా అనసూయ ‘ఆంటీ’ వివాదంలో కూడా ఘాటుగానే స్పందించింది.
ReplyForward
|