
Anchor Shyamala : బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన కేసులో భాగంగా టాలీవుడ్ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది. ఈరోజు యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెను అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే, విచారణకు సహకరించాలని సూచించింది. ఇదివరకే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు, రేపు వారిని మరోసారి విచారించనున్నారు.