
Anchor Shyamala : ప్రముఖ యాంకర్ శ్యామలను కూడా పోలీసులు విచారించారు. ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు మూడున్నర గంటల పాటు పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విచారణ కొనసాగుతోందని, కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లపై విచారణకు పూర్తిగా సహకరిస్తానని, చట్టం మరియు న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని ఆమె అన్నారు. బెట్టింగ్ నిర్వాహకులను పట్టుకోవడంలో తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం తప్పని, దీనివల్ల నష్టపోయిన కుటుంబాలకు తీరని లోటు వాటిల్లిందని శ్యామల అన్నారు. ఇకముందు ఇలాంటివి జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు.