
Anchor Srimukhi : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారు లేరు అనే చెప్పాలి.. అందుకే ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ మధ్య కాలంలో శ్రీముఖి మరింత పాపులర్ అయ్యింది.. తన చురుకైన మాటలతో యాంకరింగ్ లో తనదైన శైలితో దూసుకు పోతుంది.. మాటలు మాత్రమే కాదు అందచందాలుతో కూడా కట్టిపడేసే సత్తా ఈ భామకు ఉంది.
ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా ఈమె నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యింది అనే చెప్పాలి.. బిగ్ బాస్ 3 లో ఈమె రన్నరప్ గా నిలిచింది. అప్పటి నుండి మరింత క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు ఏకంగా అరడజను షోలతో అదరగొడుతుంది..
ఈ మధ్యనే 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న విదేశాల్లో ఒక వారం పది రోజుల పాటు సందడి చేసింది.. వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తున్న శ్రీముఖి తాజాగా మరోసారి ఫోటో షూట్ షేర్ చేసింది.. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా షేర్ చేసిన ఈ పిక్స్ నెటిజెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి..
ఇదిలా ఉండగా ఈమె ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ వార్తలపై శ్రీముఖి మాత్రం స్పందించలేదు. దీంతో ఈమె అభిమానులు, నెటిజెన్స్ ఎప్పుడు స్పందిస్తుందా అని ఎదురు చూసారు.. అయితే 2023 లోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram