Suma Kanakala :
తెలుగు యాంకర్లలో సుమ కనకాల అంటే పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలిలో అందరిని మంత్రముగ్దులను చేసే ఆమెకు అందరు మొగ్గు చూపుతుంటారు. ఒక్కో ప్రోగ్రామ్ కు రూ. లక్షల్లో పారితోషికం తీసుకుంటూ తనకు ఎదురే లేదని నిరూపిస్తోంది. వ్యాఖ్యాతలుగా మారిన ఉదయభాను, శ్యామల కాస్త నెమ్మదించినా ఆమె మాత్రం దూసుకుపోతోంది.
మాతృ భాష మలయాళం అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడే సుమ మొదట హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. ఆమె తెలుగులో కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటించింది. అందులో ప్రముఖ రచయిత వక్కంతం వంశీ హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో సినిమా రంగాన్ని వదిలేసింది. మలయాళంలో కూడా రెండు మూడు సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు.
ఇక టీవీ రంగంవైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. అదే వారి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తరువాత నటించడం రాజీవ్ కు ఇష్టం లేదు. సుమ మాత్రం దీనికి ఒప్పుకోలేదట. దీంతో కొన్నాళ్ల విడిగా ఉండిపోయారట. అప్పుడు రాజీవ్ కనకాల సుమ తనకు ఇష్టమొచ్చిన రంగంలో వెళ్లొచ్చని చెప్పడంతో మళ్లీ ఇద్దరు ఒక్కటయ్యారట.
సుమ తండ్రి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. దీంతో ఆమె తెలుగులో వ్యాఖ్యాతగా ఎదిగింది. ఇప్పుడు సుమ లేని ఏ ప్రోగ్రాం కూడా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. అలా యాంకర్లలో మేటిగా నిలుస్తోంది. చక్కనైన అందం తమాషా మాటలతో అందరిని ఆకర్షించే సుమ ఇప్పటికి కూడా తగ్గడం లేదు. దీంతో తెలుగులో మంచి యాంకర్ గా సుమ నిలుస్తోంది.