Anchor Suma Wedding Card : యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని ఆమె స్థానాన్ని మరొకరు దక్కించుకోలేని ఎత్తుకు ఎదిగింది.. యాంకరింగ్ అనే పదానికి ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా చెబుతారు. అందుకే ఈమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి షో చేయిస్తారు.
ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగు వారు కూడా మాట్లాడలేంత అనర్ఘళంగా తెలుగును మాట్లాడుతుంది.. ఎక్కడ తప్పులు లేకుండా యాంకరింగ్ చాలా ఎంటర్టైనింగ్ గా చేస్తుంది. ఒకవైపు బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూనే మరో వైపు ఈమె సినిమా ఈవెంట్స్ ను కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. సుమ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీలో స్థరపడిపోయింది.
వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. మరి పెళ్లి సమయంలో వీరి మధ్య పెద్ద వార్ జరిగిందని తన కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోకుండా తనను గదిలో కూడా బంధించారు అంటూ సుమ చెప్పింది. అయినా సుమ తగ్గకపోవడంతో తన తల్లి దండ్రులు పెళ్లి చేసారని తెలిపారు. ఇక 1999, ఫిబ్రవరి 10న వీరి వివాహం ఎంతో ఘనంగా తెలుగు మాత్రమే కాదు కేరళ సాంప్రదాయ పద్ధతిలో కూడా జరిపించారు.
మరి అప్పటి వీరి పెళ్లి పత్రిక ఇప్పుడు వైరల్ అవుతుంది.. పెళ్లి జరిగి 25 ఏళ్ళు అవుతున్న తరుణంలో ఇప్పుడు సుమ తమ పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. అప్పట్లోనే యూనిక్ వేలో వెడ్డింగ్ కార్డు అంటూ ఈమె షేర్ చేయగా ఇది కాస్త అందరి కంట పడడంతో తెగ షేర్ చేస్తున్నారు. ఇక వీరికి ఒక పాప, బాబు ఉన్నారు.