WhatsApp accounts : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ తన యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను యాడ్ చేస్తూనే ఉంటుంది. వాట్సప్ మెటా చేతికి వెళ్లిన తర్వాత మరింత సౌకర్యవంతంగా మారింది. గ్రూప్ వీడియో కాల్స్, మనీ ట్రాన్జెక్షన్, ఇలా చాలా ఫీచర్లను యాడ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. దీంతో ఒకే సెల్ ఫోన్ లో రెండు అకౌంట్లు ఉండనున్నాయి.
మెటా సంస్థ వాట్సప్ ను మరింత సౌకర్యవంతంగా మారుస్తూ వస్తోంది. ఈ మధ్య ప్రతీ సెల్ ఫోన్ లో రెండు సిమ్ (డ్యూయల్ సిమ్స్)లు ఉంటున్నాయి. యూజర్స్ అవసరాల మేరకు ఇవి ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలో యాపిల్ కూడా డ్యూయల్ సిమ్ తెస్తామని మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే.. సాధారణంగా సెల్ లో ఒకే వాట్సప్ యాక్టివ్ గా పని చేస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకే ఫోన్ లో 2 అకౌంట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని సెల్ ఫోన్లలో మాత్రమే క్లోనింగ్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. అయితే వాట్సప్ మాత్రం దీన్ని అధికారికంగా రిలీజ్ చేయనుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ మోడ్ లో ఉందట. త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్తుంది మెటా. వాట్సప్ బీటా యూజర్లకు మాత్రమే ప్రస్తుతం అంటుబాటులో ఉంచారు. పైన క్యూఆర్ కోడ్ బటన్ పక్కన బాణం గుర్తు ఉంటుంది. దీని క్లిక్ చేసి మరో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ యూజర్ ఫీచర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకే సెల్ ఫోన్ లో రెండు సిమ్ములు ఉన్నప్పుడు రెండు ఖాతాలు ఉంటే నష్టం ఏంటి అనుకుంటున్నారు.