Andersen’s Tweet :
భారతదేశ వంటకాలను ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉంటుంది. ఇది నిజమని అందరూ ఒప్పుకోవల్సిందే. శరీరంతో పాటు నాలుక, ముక్కు, కళ్లను కూడా ఇక్కడి వంటకాలు సంతృప్తి పరుస్తాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. భారత్ లో వంటకాల కోసం వాడే ఇంగ్రేడియన్స్ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా దొరకవంటే ఎటువంటి సందేహం లేదుకదా. ఒక్క మిరియాల కోసమే వజ్రాలను ఇచ్చిన దేశాలు కూడా ఉన్నాయి. మరి ఇండియన్ ఫుడ్ అంటే ఆశామాషీ కాదు. ఇక ఇందులో సౌత్ ఫుడ్ (దక్షిణ భారతదేశం)కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రొఫెసర్ భారత వంటకానికి వంక పెట్టాడు. దీనిపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఫైర్ అయ్యాడు. అసలు ఆ సంభాషణ ఎలా సాగిందంటే.
ప్రముఖ ఫుడ్ సప్లయ్ సంస్థ జొమాటో తమ కష్టమర్లను ట్విటర్ లో ఒక ప్రశ్న అడిగింది. ఏంటంటే.. ‘మీకు అర్థం కాని వంటకం ఏంటి? ఒక వేళ ఉంటే దాన్ని ప్రజలు ఎందుకు అంతగా ఇష్టపడతారు?’ దీనికి బ్రిటీష్ కు చెందిన ప్రొఫెసర్ అండర్సన్ సమాధానం ఇస్తూ ‘ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ ఫుడ్ అంటే ఇడ్లీ’నే అన్నాడు. దీంతో దక్షిణ భారతదేశ ఆహార ప్రియులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ట్విటర్ దారులు అండర్సన్ ను ‘ఇడ్లీగేట్’ అంటూ పిలిచారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కుమారుడు ఇషాన్ అండర్సన్ అన్న మాటను తన తండ్రికి ట్వీట్ చేయగా.. ఆయన స్పందించారు. ‘అవును నాయనా, ఈ ప్రపంచంలో నిజంగా సవాలు విసురుతున్న వారు కొందరు ఉన్నారు. నాగరికతను పొందడం కష్టం.. ఇడ్లీలను అభినందించడానికి, ఆస్వాదించడానికి నిజంగా అర్హత ఉండాలి అని ట్వీట్ చేశాడు. ఇది పేదవాడి వంటకం అంటూ కూడా చెప్పాడు.
దీనిపై అండర్సన్ స్పందిస్తూ ‘మొత్తం దక్షిణ భారతదేశం నాపై దాడి చేస్తుంది. నా మనసులోని మాటను మాత్రమే చెప్పాను. దోసా మరియు అప్పం అన్ని దక్షిణ భారత ఆహారాలు నాకు ఇష్టమే కానీ ఇడ్లీ (ఆ మాటకొస్తే పుట్టు) నాకు ఇష్టం ఉండవు’ అని రాసుకొచ్చాడు.