
‘ఆదిపురుష్’ సినిమా ప్రీ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు. ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఈ వెంట్ దిగ్విజయంగా కొనసాగింది. ప్రభాస్ ను చూసేందుకు దేశంలోని నలు మూలల నుంచి అభిమానులు ఫ్లయిట్ లలో కూడా తిరుపతికి వచ్చారు. నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టలేక ఇబ్బందులు పడ్డారు. అయితే అనుకున్నంత మంది కంటే ఎక్కువ మంది రావడంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఈ వేదికపై నుంచి ప్రభాస్ తన పెళ్లి ముచ్చటను కూడా ప్రకటించడంతో ఫ్యాన్స్ మరింత ఆనందానికి లోనయ్యారు. ఇక మూవీ యూనిట్ ఈ వేదిక పై నంచి అఫీషియల్ గా ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమా ఈ నెల 16న థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు.
ఇక ఈవెంట్ అనంతరం మూవీ టీం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు బయల్దేరింది. దర్శకుడు ఓం రౌత్, హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా. దర్శకుడు చేసిన పనికి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. దర్శనం అనంతరం సెండాఫ్ ఇస్తూ డైరెక్టర్ ఓం రౌత్ కృతి సనన్ ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడంతో భక్తులు, హిందువులు, నెటిజన్లు వీరు, వారనే తేడా లేకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో ఏం పని ? అంటూ మండిపడుతున్నారు. ఇది క్షమార్హం కాదని చెప్తున్నారు.






